గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్థాన్‌లోని పాక్ అణ్వాయుధాలు దాచి ఉంచిన ప్రాంతంగా పేరున్న కిరానా హిల్స్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, అయితే పొరపాటున పంపిన ఒక భారతీయ మందుగుండు సామగ్రి దానిని తాకిందని మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. కిరానా హిల్స్‌కు కేవలం 10 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న సర్ఘోడాకు పెద్ద సంఖ్యలో మందుగుండు సామగ్రిని పంపినట్లు చౌహాన్ వివరించారు.
భారత సాయుధ దళాలు ప్రయోగించిన ఓ డ్రోన్ (లాయిటరింగ్ మ్యూనిషన్) శత్రుదేశ రాడార్‌ల కోసం వెతికే సమయంలో ఇంధనం అయిపోవడంతో అనుకోకుండా ఆ కొండలను టార్గెట్ చేసిందని ఆయన చెప్పారు. “ఆ దాడులకు ముందు, మేము సర్గోధాకు చాలా లోయిటర్ ఆయుధాలను పంపాము. కిరానా హిల్స్ సర్గోధాకు 10 కిలోమీటర్ల ఉత్తరాన ఉంది. కాబట్టి ఆ లోయిటర్ ఆయుధాలు సర్గోధాలో, దాని చుట్టుపక్కల ఉన్న రాడార్ల కోసం వెతుకుతూ ఉండేవి” అని తెలిపారు.
“ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి అప్పట్లో చెప్పింది కరెక్టే. అసలు అప్పుడు ఏం జరిగిందంటే మేము పలు లాయిటర్ ఎమ్యునిషన్స్‌ను (డ్రోన్స్) సర్గోధా వైపు, ఆ ప్రాంతానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరానా హిల్స్ వైపు పంపించాము. అక్కడ ఉన్న రాడార్‌లను ధ్వంసం చేయాలని అనుకున్నాము. ఈ డ్రోన్స్ సాధారణంగా రెండు గంటల పాటు గాల్లో చెక్కర్లు కొడుతూ తమ టార్గెట్స్ కోసం వెతుకుతాయి” అని తెలిపారు. ఈ
ఈ క్రమంలోనే ఆ డ్రోన్‌లో ఇంధనం అయిపోవడంతో అనుకోకుండా హిల్స్‌ను టార్గెట్ చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలంగా లేక పీఓకేలోని స్కర్దూపై చేయాల్సిన దాడిని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్టు కూడా చెప్పారు. “దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. అది సుమారు రెండు గంటల పాటు గాలిలో చక్కర్లు కొడుతుంది, ఒకవేళ లక్ష్యం దొరకకపోతే, అది వచ్చి ఎక్కడో ఒకచోట దాడి చేస్తుంది. అది వచ్చి ఆ కొండలలో ఒకదానిపై దాడి చేసి ఉండాలి,” అని జనరల్ చౌహాన్ వివరించారు.
గత ఏడాది మే 12న, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ, భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్‌లో ఉన్న అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, భారతి ఇలా పేర్కొన్నారు: “కిరానా హిల్స్‌లో కొన్ని అణు కేంద్రాలు ఉన్నాయని చెప్పినందుకు ధన్యవాదాలు. మాకు దాని గురించి తెలియదు. అక్కడ ఏమున్నా సరే, మేము కిరానా హిల్స్‌పై దాడి చేయలేదు.”

More Stories
యుపిలో 60 ఏళ్ళు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఢిల్లీలో నిరసనల దృష్ట్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థపై పోలీసుల దృష్టి
బిహార్‌లో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ