డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఉన్నత డిగ్రీ మినహాయింపుకు అర్హత ఉన్న వాటితో సహా, హెచ్-1బి క్యాప్‌కు లోబడి ఉండే అన్ని పిటిషన్లపై అదనంగా 103,265 డాలర్ల రుసుమును (సుమారు రూ.86 లక్షలకు పైగా) అమెరికా ప్రతిపాదించింది. ప్రతిపాదిత రుసుమును దరఖాస్తు చేసే సమయంలోనే చెల్లించాలి. ఇది వర్తించే ఇతర అన్ని రుసుములు లేదా చెల్లింపులకు అదనంగా విధించబడుతుంది.
వేసిన 85,000 హెచ్-1బి క్యాప్-అధీన పిటిషన్ల ఆధారంగా, ఈ రుసుము ద్వారా ఏటా సుమారు 8.8 బిలియన్ డాలర్లు సమకూరుతాయని డిహెచ్ఎస్ అంచనా వేస్తోంది. “పన్ను చెల్లింపుదారుల నిధులతోనే నడపాల్సిన చట్టబద్ధమైన వలస కార్యక్రమాలను విచారించడానికి, పరిశీలించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి సమాఖ్య ప్రభుత్వం భరించిన ఖర్చులను తిరిగి రాబట్టడానికే ఈ ప్రతిపాదిత హెచ్-1బి రుసుము ఉద్దేశించబడింది,” అని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ తెలిపారు.
“ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల నిర్ధారణ, మోసాల గుర్తింపు, జాతీయ భద్రతా పరిశీలన, వ్యవస్థల ఆధునీకరణ, రికార్డులు, ఫీజు వసూలు కార్యకలాపాలు, ఇమ్మిగ్రేషన్ కోర్టు కార్యకలాపాలు, కాన్సులర్ వీసా ప్రాసెసింగ్, కార్మిక ప్రమాణాల అమలు, అంతర్-సంస్థల సమన్వయం” వంటి వాటికి సంబంధించిన ఫెడరల్ ప్రభుత్వ ఖర్చులను తిరిగి రాబట్టడంలో ఈ ఆదాయం సహాయపడుతుందని డిహెచ్ఎస్ తెలిపింది.
విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొన్ని లాభాపేక్షలేని పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లతో సహా, ఈ పరిమితికి లోబడి లేని హెచ్-1బి పిటిషన్లకు ఈ అదనపు ఫీజు వర్తించదు. హెచ్-1బి వీసా దరఖాస్తుల కోసం ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన 100,000 డాలర్ల ఫీజును జూన్‌లో ఒక ఫెడరల్ న్యాయమూర్తి కొట్టివేసిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.
హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ప్రతిపాదించిన భారీ అదనపు రుసుము ప్రభావం భారత టెక్కీలు, విద్యార్థులు, కంపెనీలపై తీవ్రంగా పడనుంది. హెచ్-1బీ వీసాల విషయంలో భారతీయులదే ఆధిపత్యం. అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే సింహభాగం ఉంటారు.
అమెరికాలో ప్రతి ఏటా ఆమోదం పొందుతున్న హెచ్-1బీ వీసాల్లో సుమారు 70శాతం వరకు భారత్‌లో జన్మించిన వారికే లభిస్తున్నాయి. ఇటీవలి యూఎస్‌సీఐఎస్ ఆమోదించిన మొత్తం హెచ్-1బీ పిటిషన్‌లలో దాదాపు 70 శాతానికి పైగా భారతీయులవే ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారు తమ వీసాలను పొడిగించుకునే వారిలో కూడా భారతీయులే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

More Stories
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 21 మంది మాజీ కెప్టెన్ల ఆందోళన!
సరిహద్దు సమస్యపై చర్చలకు నేడే చైనాకు అజిత్ దోవల్
డ్రగ్స్ తీసుకోవడం చూసినందుకు బంగ్లాలో హిందూ కుటుంబం హత్య