కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటుకు రేవంత్ మంత్రాంగం.. ఎమ్యెల్యేల వెనకడుగు!

కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటుకు రేవంత్ మంత్రాంగం.. ఎమ్యెల్యేల వెనకడుగు!
* రేవంత్ విదేశీ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం .. కాంగ్రెస్ ఓడిపోతుందన్న మంత్రి వివేక్ 
తన క్యాబినెట్‌లోని మంత్రి కుమార్తె నేరుగా ముఖ్యమంత్రినే తీవ్రస్థాయిలో విమర్శించినా, నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేకనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టించి, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేయించారా?  ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఇద్దరు మంత్రులతో సహా సుమారు 18 మంది ఎమ్యెల్యేలు భేటీ జరపడంతో ముఖ్యమంత్రి వర్గంలో కలకలం రేపిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
 
మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్‌లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్‌రెడ్డి వర్గం సీఎల్పీ వేదికగా సుమారు 40 మంది ఎమ్యెల్యేలతో మీడియా సమావేశం పెట్టించే ప్రయత్నం విఫలమైన్నట్లు తెలుస్తున్నది.  రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు  వేం నరేందర్‌రెడ్డి ఎంతగా వత్తిడి చేసినా 17 మంది మించి రాలేదని చెబుతున్నారు. దానితో 66 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తున్నవారు అంతంతమాత్రమే అని స్పష్టమైంది. 
 
40 మందితో బలప్రదర్శనకు దిగడం ద్వారా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుండి రాగానే సోమవారం కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని నిర్ణయించారని, అయితే ఈ విషయమై పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఆమెపై చర్య తీసుకొంటే బీసీలకు ఆగ్రహం కలగకుండా ఆమెతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డిపై చర్యకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు. 
 
శాసనసభ ఎన్నికలలో తనకు మొదట టికెట్ ఖరారు చేసి, ఆ తర్వాత డబ్బులు తీసుకొని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పించడం గమనార్హం.  ఇలా ఉండగా ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ పార్టీలోకి రావాల్సిందిగా కొండా సురేఖను జనసేన పార్టీ నాయకులు సంప్రదించినట్లు వరంగల్ ఆ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. 
కాగా, కొండా సురేఖ భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉందని, కేటీఆర్, సమంత అంశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయని రేవంత్ కు మద్దతుదారులైన ఎమ్యెల్యేలు, ఎంఎల్సీలు మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు కానీ, అనామకులైన కొండా సుష్మిత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతుందని, ఇంతకంటే బజారు కల్చర్ ఎక్కడా ఉండదని అంటూ ధ్వజమెత్తారు. 

రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే, నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని బుకాయిస్తుందని ఆరోపించారు. సంబంధం లేకపోతే ముఖ్యమంత్రిపై కూతురు చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారని, ఆమె మాత్రం తన పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీడియా సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదన్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి , దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్ , వెడ్మ బొజ్జు , వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి , కూచుకుళ్ల రాజేష్ రెడ్డి , బత్తుల లక్ష్మా రెడ్డి , బాలు నాయక్ , వీర్లపల్లి శంకర్ , కుంభం అనిల్ కుమార్ రెడ్డి , చిక్కుడు వంశీకృష్ణ ,బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే, నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని బుకాయిస్తుందని ఆరోపించారు. సంబంధం లేకపోతే ముఖ్యమంత్రిపై కూతురు చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారని, ఆమె మాత్రం తన పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకోవైపు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను శక్తి స్కీంలో విలీనం చేసే ఆలోచనపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలతో భాగంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులు చెన్నూరు పట్టణంలో  కార్మిక శాఖ మంత్రి వివేకా వెంకటస్వామి ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇస్తూ స్పష్టమైన హామీ ఇవ్వమని కోరగా ఆయన నిర్వేదంగా ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది. “నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఇప్పుడు మంత్రిగా నేను ఉన్నా.. రేపు నేను ఓడిపోతా..మా  ప్రభుత్వం పోతది..నా గ్యారెంటీతో మీకేం ఫాయిదా?” అంటూ స్పష్టం చేశారు. 

మరోవంక, ముఖ్యమంత్రి దేశంలో లేని సమయంలో అసంతృప్త నేతలు, ఎమ్మెల్యేలు మొయినాబాద్‌లోని  ఓ ఫాంహౌస్‌ లో రహస్య భేటీ జరిపినట్లు తెలుస్తున్నది. వారికి  పలువురు మంత్రులు కూడా మద్దచెబుతున్నారుతు ఇరుతుస్తున్నారని .   15-18 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో ఇద్దరు రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌ సహచరులు కూడా పాల్గొన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నది.

ఇటీవల ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో విరుచుకుపడుతున్న ఓ మాజీ ఎంపీకి చెందిన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో గురువారం ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా  ఈ నేతలు కలుసుకున్నారని ప్రచారం జరుగుతుంది.  ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యవహారశైలి, ఆయన సోదరులపై వస్తున్న ఆరోపణలు, పాలనా వివాదాలు ఫామ్‌హౌస్‌ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులే లాభపడుతున్నారని, పార్టీకి సుదీర్ఘంగా సేవలందించిన తమలాంటి వారికి ఒరిగిందేమీ లేదని వారంతా నిర్వేదం వ్యక్తం చేశారని చెబుతున్నారు.