సింగిల్ థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ల్లో నిర్దిష్టమైన టికెట్ ధరలు ఖరారు చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో టికెట్ ధరను కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70 ఖరారు చేసింది. అలాగే నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100గా నిర్ణయిచింది. ఏసీ థియేట్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150 ఖరారు చేయగా, ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200 గా నిర్ణయిచింది.
ఇక స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 ఖరారు, స్పెషల్ థియేటర్లలో ప్రీమియం రిక్లైనర్‌లో కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 ఖరారు చేసింది. దీంతోపాటు మల్టీఫ్లెక్స్‌లో రెగ్యులర్ కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 టికెట్ ధర ఉండగా, మల్టీఫ్లెక్స్‌లో రెక్లైనర్‌లో కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 టికెట్ ధర ఖరారు చేసింది.
ఇక ప్రతి థియేటర్‌లో ఉదయం 8 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 మధ్య చిన్న సినిమాకు అవకాశం ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. పండుగ సీజన్లోనూ చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో కొత్తగా ‘స్పెషల్ థియేటర్లు’ అనే కేటగిరీని చేర్చారు.
7.1 సౌండ్, 2కె, 4కె స్క్రీన్ రిజల్యూషన్ లేదా స్క్రీన్ సైజ్ 75 అడుగుల కంటే ఎక్కువగా ఉన్న థియేటర్లను ‘స్పెషల్ థియేటర్లు’గా పరిగణిస్తారు. ఇందులో భారీ బడ్జెట్ సినిమా రిలీజైన సమయంలోనే చిన్న చిత్రాలు కూడా విడుదలైతే వాటికి ఉదయం 11 నుంచి రాత్రి 9 మధ్యలో కచ్చితంగా ఒక షోను కేటాయించాలని నిబంధన పెట్టింది. చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే రూ.100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్తో రూపొందించే చిత్రాలను ‘హై బడ్జెట్’ సినిమాలుగా గుర్తించనుంది. ఈ సినిమాలకు రిలీజైన తొలి 10 రోజులు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే అలా టికెట్ రేటును పెంచుకుంటే మాత్రం వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్కు విరాళంగా ఇవ్వాల్సిందేనని అదేశాలు ఇచ్చింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆ నిధిని ఉపయోగించనున్నట్లు చెప్పింది.

More Stories
హాకీ ప్రపంచకప్ లోపాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్
మంత్రుల నిర్ణయాలపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కు `వీటో అధికారం’!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన ఇడి