విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖుల స్పందన గురించి జరుగుతున్న చర్చల మధ్య బిజెపి ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దేశంలో జరుగుతున్న నిరసనలపై అగ్రశ్రేణి నటులు గళం విప్పడం లేదని షా గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆమె తన సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలను పంచుకున్నారు.
జార్ఖండ్‌లో జరుగుతున్న నిరసనలపై షా మౌనాన్ని పీయూష్ మిశ్రా ప్రశ్నించిన తర్వాత ఈ ఆన్‌లైన్ చర్చలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖులు “నోటిలో ఎముక ఉన్న కుక్క” లాంటి వారని ఆ సీనియర్ నటుడు గతంలో చేసిన పోలికను ఆయన ప్రస్తావించారు. పైగా, నషీరుద్దీన్ షాను నక్కతో పోల్చారు. అవసరం వచ్చినప్పుడే వాళ్లు మాట్లాడుతారని, కుక్క నోట్లో బొక్క ఉన్నప్పుడు మాట్లాడలేదని నషీరుద్దీన్ షా ఆరోపించారు.
అయితే జార్ఖండ్‌లో జరుగుతున్న ఆందోళనల గురించి షా ఎందుకు మాట్లాడం లేదని ఆమె ప్రశ్నించారు. షా వ్యాఖ్యలపై పీయూష్ మిశ్రా చేసిన వీడియోను కంగనా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో నషీరుద్దీన్ షాను నక్కతో పోల్చుతూ బీజేపీ ఎంపీ కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి దగ్గర కుక్కలాగ పడి ఉండటం నిజమే అని, తాను ఈ దేశం అన్నం తింటున్నానని, ఈ దేశ రక్షణ చూసుకుంటానని, దీని కోసం పోరాడుతానని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే, నషీర్ సాబ్ మాత్రం ఈ దేశంలో ఉంటూ పొరుగు దేశం కోసం పోరాడుతారని అంటూ ఆమె ధ్వజమెత్తారు. తనకు తిండి పెడుతున్న దేశాన్ని తాను కాపాడుకుంటానని, దీని పట్ల గర్వంగా ఫీలవుతున్నానని, కానీ ఈ నేలపై తిండి తింటున్న నషీర్ మాత్రం పొరుగు దేశాన్ని రక్షిస్తున్నారని కంగనా రనౌత్ తన సోషల్ మీడియా పోస్టులో రాశారు.
“నిజం ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి పెంపుడు జంతువులమే. నాకు తిండి దొరికే ఈ ఇంటినే నేను కాపాడుతున్నందుకు గర్వపడుతున్నాను. కానీ నసీర్ సాబ్ ఈ నేల మీదే తింటూ, ఇరుగుపొరుగు వారిని కాపాడుతారు” అంటూ ఆమె ధ్వజమెత్తారు.

More Stories
ప్రజా సేవ పట్ల నిరంతర నిబద్ధతను ప్రదర్శించిన కోవిద్
రాజ్యసభలో కలకలం రేపిన ‘లుంగీవాలా వ్యాఖ్యలు’
ప్రతిపక్షం చర్చ నుండి పారిపోతుంది