ఆ వెబ్‌సైట్‌లో ముఖ్యంగా చైనాలోని జాంగ్‌జియాకోవు నగరానికి వెళ్లిన విదేశీయుల వివరాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వారిలో భారత్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్థాన్, సూడాన్ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. జాంగ్‌జియాకోవు హెబే నార్త్ యూనివర్సిటీలో చేరిన విదేశీ విద్యార్థుల సమాచారం కూడా ఇందులో ఉంది.
అయితే వారిలో భారత్, పాక్‌కు చెందిన వారే అధికం కావడం గమనార్హం. ఆ వెబ్‌సైట్‌లో వారి వ్యక్తిగత వివరాలు సహా వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే సమాచారం నమోదై ఉన్నది. వీరందరినీ చైనా అధికారులు కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. వారందరూ స్వదేశాలకు వెళ్లాక కూడా ఈ నిఘా కొనసాగుతుండడం గమనార్హం.
చైనాలోని పోలీస్ విభాగాలకు రోబోటిక్స్, నిఘా పరికరాలను విక్రయించే ‘ఆరిజిన్ డైనమిక్’ అనే సంస్థకు కూడా ఈ వెబ్‌సైట్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డేటా అక్కడి పోలీసులకు అందుబాటులో ఉంది. ప్రజలు ఎక్కిన విమానాలు, వారి సీటు నెంబరు, రైళ్ల వివరాలు అందులో అందుబాటులో ఉన్నాయి. 2019లో హాంకాంగ్‌లో భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. దేశ ప్రజల విదేశీ భాగస్వాములపైనా ప్రత్యేక నిఘా ఉంచింది. అయితే ఈ సైట్‌లోని సమాచారమంతా మే నెలలో అదృశ్యం కావడం గమనార్హం.

More Stories
పీఓకె అణచివేతపై వార్తలిచ్చిన అల్ జజీరాపై పాక్ వేటు
లాంఛనంగా భారత్ కు కామన్వెల్త్ క్రీడల పతాకం
కామన్వెల్త్ క్రీడలలో 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్