బిల్లు ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలు నీట్ అంశంపై నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించడంతో సభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. ప్రతిపాదిత బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్-1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను ‘వందే మాతరం’ గీతానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
బిల్లు ప్రవేశపెట్టడాన్ని సీపీఐ సభ్యులు పీ సంతోష్ కుమార్, జాన్ బ్రిట్టాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. వందేమాతరాన్ని తాను గౌరవిస్తానని పేర్కొన్న సంతోష్ కుమార్, ఈ బిల్లు ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటోపాధ్యాయ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై సభాపతి జోక్యం చేసుకుని బిల్లుకు సంబంధించిన అంశాలకే పరిమితమై మాట్లాడాలని సూచించారు. అనంతరం విద్యార్థుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.
వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం, ప్రతిపక్షాల నినాదాలతో రాజ్యసభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు మరోసారి ఆందోళన కొనసాగించారు. దీంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. అటు లోక్సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

More Stories
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, ప్రశ్నలు అడగడం అవసరం
దేశాభివృద్దికోసం ‘దిమాగీ నక్సల్స్’ను ఏకాకి చేయాలి
ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలి