భారత్‌కు ముప్పుగా బ్రహ్మపుత్రపై చైనా బారీ జల విద్యుత్ ప్రాజెక్టు

భారత్‌కు ముప్పుగా బ్రహ్మపుత్రపై చైనా బారీ జల విద్యుత్ ప్రాజెక్టు
 
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచ అత్యంత బారీ జలవిద్యుత్ ప్రాజెక్టు భారత్‌కు ముప్పుగా మారనుంది. భారతదేశ సరిహద్దుల వెంబడి 137 బిలియన్ డాలర్ల వ్యయ అంచనాలతో ఈ ప్రాజెక్టులో భాగంగా మెడోగ్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. బ్రహ్మపుత్ర మలుపులు తిరిగే చోట, భూకంపాల తాకిడి అత్యధికంగా ఉండే నదీ గర్భం ప్రాంతంలోనే ఈ డ్యాం నిర్మాణంతో భూ అంతరాలల్లో విస్ఫోటనపు ముప్పు తలెత్తుంది. 

చైనాకు చెందిన సెడిమెంటరీ అండ్ తేథియాన్ జియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ మెగా డ్యామ్ పైజెన్ ఫాల్ట్ (యాక్టివ్ ఫాల్ట్‌లైన్) పైనే నిర్మితమవుతోంది. దీనివల్ల కొండచరియలు, భూకంపాలు సంభవించడం, నిర్మాణంలో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన ఈ వివరాలు ప్రాజెక్ట్ భద్రతపైనే కాదు భారత్‌పై చూపే ప్రభావం గురించి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 
 
యార్లుంగ్ సాంగ్పో భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్ర నదిగా మారి, బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు లక్షల మంది ప్రజల జీవనాధారంగా నిలుస్తుంది. ఎగువ చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ వల్ల బ్రహ్మపుత్రలో నీటి భద్రత, పర్యావరణం, దిగువన ఉన్న పౌరుల జీవనానికి ముప్పు వాటిల్లుతుందని భారత్ పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
తాజాగా, చైనా శాస్త్రవేత్తలే మెగా డ్యామ్‌లో భౌగోళిక ముప్పు ఉందని అంగీకరించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనితో భారత ఈశాన్య రాస్ట్రాలలో ఇప్పటికే భూ ప్రకంపనల జోన్‌లోకి వచ్చే విస్తారిత ప్రాంతాలకు ముప్పు ఏర్పడనుంది. ఈ డ్యాం , ఇక్కడి జల విద్యుత్ ప్రాజెక్టు సముదాయం భారత్ పాటిల వాటర్ బాంబు కానుంది. భూగర్భ నిక్షిప్త మందుపాతర అవుతుందని హెచ్చరించారు. హిమాలయాల్లో భూకంపాల తాకిడి ఉండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు.  
 
పైగా భూగర్భ రాతి పొరలలో ఇటీవలి కాలంలో సుదూర ప్రాంతాల్లోని పరిణామాలతో రాపిడి పెరుగుతోంది. పైగా టిబెట్‌లో ప్రవహించే బ్రహ్మపుత్ర ఎగువన యాక్టివ్ ఫాల్ట్ లైన్ ఫరిధిలోనే అంటే అంతర్గత లోపాలు రాపిడిలు ఉండే చోట భారీ డ్యాం నిర్మాణం భవిష్యత్తులోనే కాకుండా సమీప కాలంలోనే భూకంపాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరించారు. 
 
అరుణాచల్ ప్రదేశ్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ డ్యాం బాండ్ విలయసూచికగా రూపొందుతోందని నిర్థారణ అయింది. ఈ ప్రాజెక్టుకు గత ఏడాది నిర్మాణ పనులు ఆరంభం అయ్యాయి.   ఏడాది మొత్తం 300 బిలియన్ కిలోవాట్ హవర్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో డిజైన్ చేసిన ఈ డ్యామ్ నిర్మాణం గతేడాది ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా గుర్తింపు పొందిన త్రీ గార్జెస్ డ్యామ్ ఉత్పత్తి కంటే ఇది మూడురెట్ల అధికం.