అమెరికాలో ట్రంప్ అధికార యంత్రాంగం మరోసారి ఇమిగ్రేషన్ విధానాలను, గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, హెచ్ 1 బిలపై సరికొత్త ఆంక్షలకు దిగింది. దీనితో అమెరికాలో వలసదార్లకు కష్టాలు మరింత ఇనుమడించాయి. ఈ నెల 10వ తేదీన అమలులోకి వచ్చేలా అమెరికా వలసల అధికారిక విభాగం యుఎస్‌సిఐసి తాజా రూల్స్‌ను సిద్ధం చేసింది.
విదేశాల నుంచి ఉద్యోగులను నియమించుకొనే సంస్థలపై మరింత ఆర్థిక భారం మోపడం, అంతర్జాతీయ విద్యార్థులకు వీసా నిబంధనలను మార్చడం, ఆటోమేటిక్ వీసా పొడిగింపులను రద్దు చేయడం వంటి వాటిని వలస నిబంధనల్లో చేర్చాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో భారత్ నిపుణులు, విద్యార్థులు, హెచ్-4 వీసా ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. అమెరికా హోంశాఖ, కార్మిక శాఖ, విదేశాంగ శాఖలు తమ ఎజెండాలో వీటిని చేర్చినట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలో హెచ్ 1 బి వీసాలు ఎక్కువగా పొందే భారతీయ ఐటి నిపుణులకు మరింత గడ్డు పరిస్థితి ఏర్ప డనుంది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై మరింత భారం పడుతుంది. అంతర్జాతీయ వీసాల జారీలో కూడా పలు మార్పులు చేపట్టారు. పదేపదే వర్క్ పర్మిట్ పొడిగింపులను ఇకపై నిలిపివేస్తారు. అసాధారణ పరిస్థితుల్లో తప్పితే ఎవరికైనా ఈ పని అనుమతిని పెంచేందుకు వీలుండదు.
డిపార్ట్‌మెంట్ ఆప్ హోం ల్యాం డ్, సెక్యూరిటీ కార్మిక శాఖ ప్రతిపాదిత అజెండాలో భారీ స్థాయి మార్పులను చేర్చినట్లు వెల్లడైంది. చాలా వరకూ నిబంధనలను దశ లవారిగా ఈ నెలలోనే అమలుచేసేందుకు రంగం సిద్ధం అయింది. దీనితో భారతీయ ఉద్యోగార్థులు కలవరం చెందుతున్నారు. ఇప్పుడు హెచ్ 1బి వీసాలపై ఉద్యోగాల్లోకి చేర్చుకునే వారికి తొలిసారి కంపెనీలు అదరంగా ఒక్కొక్కరికి 4000 డాలర్లు చెల్లించాల్సి ఉంది.
ఎల్ 1 పిటిషన్లకు ఇది 4000డాలర్లుగా ఉంది. అయితే మారే రూల్స్ మేరకు ఇకపై వర్క్‌పర్మిట్ పొడిగించినప్పుడల్లా ఈ మొత్తం ఆయా కంపెనీలు భరించాల్సి ఉంటుంది.
భారతీయులు ఎక్కువగా ఆధారపడి పనిచేసే థర్డ్ పార్టీ క్లయింట్ నియామకాలో ఉద్యోగి యజమాని వాస్తవిక సంబంధాలను, ఉద్యోగుల పట్ల వారి విశ్వసనీయతను ఇమిగ్రేషన్ విభాగానికి కంపెనీలు క్రమం తప్పకుండా వివరించాల్సి ఉంటుంది. హెచ్ 1బి వీసా పర్మిట్లకు, గ్రీన్‌కార్డు ద రఖాస్తులకు నూతన నిబంధనలను ఖరారు చేశారు.
దీని మేరకు దరఖాస్తుదార్లు కేవలం తమ స్వదస్తూరితోనే వీటిని నింపాల్సి ఉం టుంది. లేదా సముచిత రీతిలో ఉండే సంతకాలతో కూడిన అంటే గెజిటెడ్ సంతకాలతో కూడినవాటిని పరిశీలనకు స్వీకరిస్తారు.

More Stories
నిజ్జర్ హత్యకులారెన్స్ బిష్ణోయ్ ఆదేశం.. భారత్ ప్రమేయం లేదు!
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత పట్ల భారత్ ఆందోళన
ఇండోనేషియాలోని వెయ్యేళ్ల నాటి ప్రంబవన్ఆలయానికి మోదీ