టి-20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత్ మహిళ జట్టు 2028లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. ఆసియా జట్లలో ఒకటైన భారత్ టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పాయింట్లతో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిందని ఐసీసీ తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టి-20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కి చేరుకోలేకపోయింది.
అయితే ఈ టోర్నీలో ఆసియా తరఫున భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో భారత జట్టు ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వేదికగా ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి. 1900లో ఒక్కసారి మాత్రమే ఒలింపిక్స్‌లో భాగమైన క్రికెట్128 ఏళ్ల విరామం తర్వాత లాస్‌ఏంజెల్స్‌లో మళ్లీ క్రికెట్ పోటీలకు తెరలేవనుంది.
మెగా టోర్నీకి మరో రెండేళ్లే ఉండడంలో జట్ల ఎంపికపై దృష్టి సారించింది ఐసీసీ. ఈ క్రమంలోనే ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టును విశ్వ క్రీడలకు తీసుకుంటోంది. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు ఆరు జట్లతో నిర్వహించనున్నారు. ఆసియా ఖండం నుంచి టీమిండియా క్వాలిఫై కాగా, ఓసియన్ నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లండ్ ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకున్నాయి. తద్వారా లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి నాలుగు మహిళల జట్లుగా నిలిచాయి.
2028 విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐదో జట్టుగా ఎంపికయ్యే అవకాశముంది. అయితే, ఈ ఏడాది జూన్ 30 నుంచి డిసెంబర్ 31 మధ్య యూఎస్‌ఏ టాప్-15లో ఉండాలి. ఒకవేళ అమెరికా విఫలమైతే 2027 మార్చి 1 నాటికి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో ఉండని జట్టు ఐదో స్థానం దక్కించుకుంది. చివరి బెర్తును ఐసీసీ ఒలింపిక్ క్వాలిఫయర్ 2027 ద్వారా నిర్ణయించనున్నారు.
ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు మాత్రమే తలపడనున్నాయి. ఐసీసీ విడుదల చేసిన ఈ నిబంధనల ప్రకారం భారత మహిళల జట్టు ఇప్పటికే ఒలింపిక్స్ అర్హత సాధించగా, పురుషుల జట్టుకు మాత్రం 2026 డిసెంబర్ నాటి ర్యాంకింగ్స్ కీలకం కానున్నాయి. ప్రస్తుతం పురుషుల క్రికెట్‌లో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అత్యుత్తమంగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి పురుషుల జట్టు అర్హత కూడా దాదాపు లాంఛనమే కాగలదు.

More Stories
అమెరికాకు ‘కమ్యూనిజం’ అతిపెద్ద ముప్పు… ట్రంప్
ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ అర్ధరాత్రి వైమానిక దాడులు
అమెరికా, ఇజ్రాయెల్‌లపై అంతర్జాతీయ కోర్టులను ఇరాన్