ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఆరు మంది ఎంపీలు ఇవాళ ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన ప్రెన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉద్ధవ్ టీమ్‌లో మొత్తం 9 మంది ఎంపీలు ఉండగా, దాంట్లో ఇప్పుడు ఆరు మంది ఎంపీలు షిండే వర్గంలో చేరారు.
ఏక్‌నాథ్ వర్గంలో చేరిన ఎంపీల్లో ఓమ్‌రాజే నింబాల్కర్(ధారాశివ్), సంజయ్ దినా పాటిల్(ముంబై నార్త్ ఈస్ట్), సంజయ్ జాదవ్(పర్బని), సంజయ్ దేశ్‌ముక్(యవత్మాల్-వాసిమ్), నగేశ్ పాటిల్ అస్తికర్(హింగోలి), బౌసాహెబ్ వక్‌చౌరే(షిర్డి) ఉన్నారు. రెబల్స్ ఎంపీలే షిండే వర్గంలో చేరడంలో సేన యూబీటీ సంఖ్య కేవలం మూడుకు పడిపోయింది.
ఎంపీలకు స్వాగతం పలుకుతూ షిండే ఇలా పేర్కొన్నారు: “పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ‘పులులు వస్తాయి’ అని నేను చెప్పాను. ఇప్పుడు ఆరు పులులు మా పక్షాన నిలిచాయి.” ఉద్ధవ్ వర్గం నుండి నాయకుల ఫిరాయింపుల గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘ఆపరేషన్ టైగర్’ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
“అంకితభావం కలిగిన శివ సైనికులు మా కుటుంబంలో చేరారు. నాలుగేళ్ల క్రితం మేము తిరుగుబాటు చేసినప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు మాకు అండగా నిలిచారు. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు కూడా మాతో చేరారు. శివసేనను కాపాడటానికి 2022లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది” అని చెప్పారు.
“శివసేన సిద్ధాంతాన్ని, బాలాసాహెబ్ థాక్రే ఆశయాలను పరిరక్షించడానికి మేము ఏకమయ్యాము. వీరంతా క్షేత్రస్థాయి కార్యకర్తలు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు మాలో చేరలేదు. తమ ప్రజల, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేయడానికే వారు వచ్చారు,” అని షిండే పేర్కొన్నారు. “మేము ఎవరి మార్గానికి అడ్డుపడము, కానీ ఎవరైనా మా దారికి అడ్డువస్తే మాత్రం ఊరుకోము. మా ఉద్దేశాలు స్పష్టంగా ఉండటం వల్లే, ప్రజలు మాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీలు, కార్పొరేటర్లుగా మమ్మల్ని ఎన్నుకున్నారు,” అని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తప్పుకునేందుకు రెబల్స్‌కు మూడో వంతు మెజారిటీ కూడా ఉన్నది. ఆరు పులులు ఇక్కడే ఉన్నాయని, వాళ్లు ఇప్పుడు రియల్ శివసేన ఫ్యామిలీలో కలిశారని, రియల్ శివసేన ఫ్యామిలీకి స్వాగతం చెబుతున్నానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి షిండే తెలిపారు. శివసేన పార్టీని కాపాడుకునేందుకు గతంలో తాము రెబల్స్‌గా మారామని, ఇప్పుడు రెండో దశ ప్రారంభమైందని చెప్పారు.

More Stories
‘ఆపరేషన్ టైగర్’ విజయవంతంగా పూర్తి
విరాళాల దుమారంపై సీఎం యోగికి సిట్ ప్రాథమిక నివేదిక
పంజాబ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది