తాజా ఆదేశాల ప్రకారం ఎవరైనా అధికారి ఫోన్ వాడుతూ పట్టుబడితే ఆ ఫోన్‌ను వెంటనే ధ్వంసం చేస్తారు. అలాగే, కోర్టు నియమాలకు అనుగుణంగా, షరియా చట్టాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అధికారుల వద్ద ఉన్న ఫోన్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. వందలాది ఫోన్లను ఒకేచోట చేర్చి ధ్వంసం చేశారు.
ఫోన్లు వాడటం వల్ల కొన్ని కీలక డాక్యుమెంట్లు లీక్ కావడం, ఉత్పత్తి తగ్గిపోవడం, పనులు మందగించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ఫోన్లు వాడటం వల్ల సున్నితమైన సమాచారం లీకవుతోందని తాలిబన్లు గుర్తించారు. కొందరు అధికారులు ఫోన్లు వాడుతూ పని చేయడం లేదు.
అలాగే, మీటింగ్ జరిగేటప్పుడు కూడా ఫోన్లకే అతుక్కుపోతున్నారు. కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకున్నప్పుడు సుప్రీం లీడర్ సంతకం చేయకముందే దానికి సంబంధించిన వివరాలు ప్రజలకు చేరిపోతున్నాయి. ఇలాంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేసిన తాలిబన్లు తాజాగా అధికారికంగా ఫోన్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

More Stories
అంతరిక్షం, అణుశక్తి, ఏఐలో భారత్ దూసుకుపోతోంది
ప్రధానిగా మోదీ ఉండగా భారత్ పై దాడి జరిగితే అండగా ఉంటాం
బంగ్లాలో ఇస్లాం సంస్థల హెచ్చరికలతో ఆగిపోయిన రాముడి విగ్రహం