ఇరాన్ పై అమెరికా యుద్ధం ఖర్చు సుమారు 29 బిలియన్ డాలర్లకు పెరిగిందని పెంటగాన్ ప్రకటించింది. అమెరికా సైనిక సంసిద్ధత, దాని ప్రభావంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. క్యాపిటల్ హిల్ లో జరిగిన బడ్జెట్ పరిశీలన సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఖర్చు రెండు వారాల క్రితం సైనిక శాఖ ఇచ్చిన మునుపటి అంచనా కన్నా సుమారు 4 బిలియన్ డాలర్లు అధికంగా ఉంది.
1.5ట్రిలియన్ డాలర్ల 2027 రక్షణ బడ్జెట్ అభ్యర్థన గురించి అమెరికా యంత్రాంగ ప్రతినిధి హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ చైర్మన్ డాన్ కెయిన్ , పెంటగాన్ ఫైనాన్స్ చీఫ్ జూల్స్ హర్స్ 111లు వివరిస్తుండగా యుద్ధం వ్యయం గురించి కాంగ్రెస్ ప్రశ్నించింది. అది 25 బిలియన్ డాలర్లుగా ఉంది అని హెగ్సెత్ ఏప్రిల్ 29న చేసిన అంచనాను ప్రస్తావిస్తూ హార్స్ తెలిపారు.
అయితే జాయింట్ స్టాఫ్ టీమ్, కంప్ట్రోలర్ టీమ్ ఆ అంచనాను నిరంతరం పరిశీలిస్తున్నాయని, పరికరాల రిపేర్లు, భర్తీ ఖర్చులు వంటి విస్తృత నిర్వహణ ఖర్చును కలిపి ఇప్పుడు అది 29 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉందని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు పూర్తి వివరాలు ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించగా హెగ్సెత్ సమాధానాన్ని దాటవేస్తూ పెంటగాన్ బడ్జెట్ నుండి తమకు అవసరమైన మొత్తాన్ని కేటాయించాల్సిందేనని చెప్పారు.
డెమోక్రాట్లు, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారు పెంటగాన్ లెక్కలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరాన్ వలన కలిగిన నష్టంతో సహా యుద్ధం ఖర్చు చాలా ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధానికి పెరుగుతున్న ఖర్చు, అమెరికా లక్ష్యాలపై పారదర్శకత లోపించిందని డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలని, ఈ యుద్ధంతో ఏం సాధించాం, ఎంత మూల్యం చెల్లించామో వెల్లడించాలని డెమోక్రాట్ సభ్యులు రోసా డెలావురా నిలదీశారు.

More Stories
ఇంధనం సరఫరాలో భారత్ కు నష్టం వాటిల్లనివ్వం.. రష్యా భరోసా
500 రోజులైనా చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ తిరస్కారం!
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడిలో 9 మంది మృతి