తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పోలవరం వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పోలవరం వివాదం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు వివా దం ముదురుతోంది. పోలవరం ఫేజ్-2 (45.72 మీటర్ల ఎత్తు) పనులను ఎపి ప్రభుత్వం చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫేజ్-2 పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆ లేఖలో ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ముఖ్యంగా భద్రాచలం సహా ప్రభావిత ప్రాంతాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 36 వాగుల డ్రైనేజ్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎపి పనులు చేస్తోందని ఈ లేఖ లో ఆరోపించింది.
 

పోలవరం లిఫ్ట్ స్కీమ్ వెంటనే ఆపాలని తెలంగాణ కోరింది. ఎపి పనులను నియంత్రించాలని పిపిఏకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అనుమతులు లేకుండా ముంపు సర్వే పూర్తి చేయకుండా ఈ పనులు చేపట్టడం అక్రమమని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ పనులు చేపట్టవద్దని డిమాండ్ చేసింది. 

 
పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎపి పనులు చేస్తోందని ఈ లేఖలో ఆరోపించింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ వెంటనే ఆపాలని తెలంగాణ కోరింది. ఎపి పనులను నియంత్రించాలని పిపిఏకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అనుమతులు లేకుండా ముంపు సర్వే పూర్తి చేయకుండా ఈ పనులు చేపట్టడం అక్రమమని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. 
 
ఇప్పటికే ఈ పనులు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు అడ్డుకోవాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఎపి విభజన చట్టం నిబంధనలను ఎపి ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఈ పిటీషన్‌లో పేర్కొంది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జిహెంఆర్‌ఎంబి) అనుమతులు తీసుకోకుండా ఎపి ఈ పనులు చేపట్టిందని తెలంగాణ పేర్కొంది. 
 
ఫేజ్ 2 వల్ల తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో భారీగా ముంపు ఉంటుందని నిర్వాసితుల పునరావాస పనులు పూర్తి చేయకుండానే పనులు పెంచిందని ఈ పిటీషన్‌లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ బలమైన వాదనలను వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఎపి ప్రభుత్వం పిబి లింక్ ప్రాజెక్టులో మార్పులు చేసి బనకచర్లకు బదులు నల్లమల్ల సాగర్‌కు నీటిని తరలించేలా కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకురావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.