మే 4న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బెంగాల్, అసోంలోని ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను బిజెపి దక్కించుకుంది. ఈ క్రమంలో రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కమలం పార్టీ పట్టు నిలుపుకుంది. అలాగే, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వ్ స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షాలు మంచి ఫలితాలను సాధించాయి. బెంగాల్‌లో ఎస్‌సీ రిజర్వ్ స్థానాల్లో 75 శాతం సీట్లను, ఎస్‌టీ రిజర్వ్‌డ్ సీట్లలో 100 శాతం స్థానాల్లో బిజెపి జయకేతనం ఎగురవేసింది. అంటే 16 ఎస్‌టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో విడయఢంకా మోగించింది.
మరోవైపు, 126 నియోజకవర్గాలు ఉన్న అసోంలో తొమ్మిది సీట్లు ఎస్‌సీలకు, 19 సీట్లు ఎస్‌టీలకు రిజర్వ్‌డ్ అయ్యాయి. 9 ఎస్‌సీ సీట్లలో ఎన్‌డీఏ కూటమి 8 స్థానాల్లో (బీజేపీ ఒక్కటే 5 చోట్ల) విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక స్థానానికే పరిమితమైంది. 19 ఎస్‌టీ రిజర్వ్‌డ్ సీట్లలో ఎన్‌డీఏ క్వీన్‌స్వీప్ చేసింది. బీజేపీ ఒక్కటే 13 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ఎన్‌డీఏ 46 ఎస్‌సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో 9 గెలుచుకుంది. రెండు ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఒకదాంట్లో విజయం సాధించింది.
పుదుచ్చేరిలో ఐదు ఎస్ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో రెండింటిని ఎన్‌డీఏ గెలుచుకుంది. ఈ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ వైపు ఎస్‌సీ, ఎస్‌టీ ఓటర్లు స్పష్టంగా ఏకీకృతం అవుతున్నట్లు తెలియజేస్తున్నాయి. రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఎన్‌డీఏకి అధికార స్తంభంగా మారాయని స్పష్టం అవుతుంది.
అసోంలో రిజర్వ్‌డ్ సీట్లలో ఎన్‌డీఏ జయకేతనం ఎగురవేయడానికి భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించిందని వెల్లడైంది. ఈ డీలిమిటేషన్ వల్ల ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు 16 నుంచి 19కి, ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల సంఖ్య 8 నుంచి 9కి పెరిగాయి. ఎగువ అసోం, కొండ ప్రాంతాల్లో బీజేపీ విస్తరణ, బీపీఎఫ్‌తో పొత్తు ఎస్‌టీ సీట్లలో ఎన్‌డీఏ పాగా వేయడానికి బాగా ఉపయోగపడిందని అంచనా.
అలాగే బెంగాల్‌లోని 68 ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లలో బీజేపీ 51 స్థానాలను గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలు దళితుల మద్దతు స్పష్టంగా బీజేపీకి దక్కడాన్ని తెలియజేస్తున్నాయి. ఉత్తర బె గాల్, జంగల్‌మహల్ వంటి గిరిజన ప్రాంతాల్లో బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం ఓటర్ల ఏకరీతి తీర్పును సూచిస్తోందని వెల్లడవుతుంది.
కాగా, బెంగాల్‌లో మొత్తం 84 ఎస్సీ, ఎస్‌టీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉండగా, బీజేపీ 67 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో టీఎంసీ 17కి పరిమితమైంది. బీజేపీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూనే బలహీన వర్గాల ఓట్లను కూడా బెంగాల్‌లో కొల్లగొట్టింది. బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోని ఉన్న మతువా వర్గం కూడా బీజేపీకే తమ మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తోంది

More Stories
బిజెపి చిహ్నాలతో హింసను రెచ్చగొడుతున్న టిఎంసి!
పంజాబ్ జంట ప్రేలుళ్ళ వెనుక పాక్, ఐఎస్ఐ ప్రమేయం!
ఇండి కూటమి త్వరలో కుప్పకూలిపోతుంది