దేశ రాజధాని ఢిల్లీని ఎండ భయపెడుతోంది. తీవ్ర వడగాల్పులు, ఎండ ప్రభావంతో స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో పని చేసే వర్కర్స్‌కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వాలని ప్రకటించింది.
దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తప్పనిసరిగా బ్రేక్ అమలు చేయాల్సిందే. ఈ సమయంలో ఏ పనీ చేయకుండా, ఎండ ప్రభావానికి గురికాకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. ముఖ్యంగా కార్మికులు, ఆరు బయట, ఎండలో పని చేసే కార్మికులు, సిబ్బందికి ఈ రూల్ వర్తిస్తుంది. ఎండ, వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేఖా గుప్త తెలిపారు. వడగాల్పులు, ఎండ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యానికి గురికావడంతోపాటు ప్రాణాలకు కూడా ప్రమాదం.
అందుకే ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు బ్రేక్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ విభాగాలు కలిసి పని చేయాలని సీఎం ఆదేశించారు. ఎండ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికులు, సిబ్బంది వడదెబ్బకు, డీ హైడ్రేషన్‌కు గురికాకుండా చూడాలి. బయట వివిధ పనుల కోసం వెళ్లే కార్మికులు, సిబ్బంది, ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ప్రభుత్వ బస్సులు, బస్సు స్టాపుల్లో మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డ్రింక్స్ అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. అనేక చోట్ల వాలంటీర్లు వీటిని అందించనున్నారు. వడదెబ్బ ప్రభావానికి గురై ఆస్పత్రులకు వచ్చే వారి కోసం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడా వైద్య సేవల్ని మెరుగుపరుస్తున్నారు.
వైద్య సిబ్బందిని అలర్ట్‌లో ఉంచారు. వడదెబ్బకు గురైన వారికి ప్రత్యేక సేవలు అందించేందుకు అవసరమైన మందులు, ఎక్విప్‌మెంట్లు సిద్ధం చేసింది. స్కూళ్లు, విద్యా సంస్థల్లో కూడా మంచి నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. బహిరంగ ప్రదేశాల్లో కొన్ని చోట్ల వాలంటీర్లు కాటన్ టోపీలు, మఫ్లర్లు వంటివి అందిస్తున్నారు. ఎండ ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

More Stories
జబల్పూర్ బోటు ప్రమాదంలో మొత్తం 13 మృతదేహాలను వెలికితీత
బెంగాల్ ఫాల్తా నియోజకవర్గంలోని 285 బూత్‌ల్లో 21న రీ పోలింగ్
అత్యాచార బాధితుల గర్భస్రావం చట్టం సవరించాలి