ఎఐ సంపన్నుల చేతుల్లో ఆయుధంగా మారుతుందని, భవిష్యత్తులో తీవ్ర ముప్పును కలిగించే అవకాశాలున్నాయని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహిత జెఫ్రీ ఎవరెస్టు హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలు ఎఐ ని ఉపయోగించి, ఉద్యోగుల సంఖ్యను అమాంతం తగ్గించడం, కొత్త నియామకాలు నిలిపివేస్తారని స్పష్టం చేశారు.
దీని వల్ల నిరుద్యోగం ఊహించని స్థాయికి చేరుకుంటుందని, అంచనాలకు అందని విధంగా కంపెనీల యజమానులు దండిగా లాభాలు సంపాదిస్తారని తెలిపారు. ఫలితంగా కొద్ది మంది సంపన్నులుగా మారుతారని, 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగజారుతారని, ఇది ఎఐ తప్పిదం కాదని, పెట్టుబడిదారుల విధానం అని ఆయన వివరించారు.
ఉదాహరణకు పదివేల మంది కష్టపడి ఒక అంశాన్ని నేర్చుకుంటే, దీనంతటినీ ఎఐ తక్షణమే నేర్చుకుంటుంది. ఎఐ తయారీ సంస్థలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించేలా సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చి అభివఅద్ధి చేశాయని హింటన్ పేర్కొన్నారు. ఎఐ రాకతో ప్రారంభ దశలో నియమించుకునే గ్రాడ్యుయేట్ల ఎంపికలు తగ్గాయని, మున్ముందు పనిచేస్తున్న వారిని ఇంటికి పంపనున్నారని న్యూయార్క్ కు చెందిన ఫెడరల్ రిజర్వ్ సర్వేలో వెల్లడయ్యిందని తెలిపారు.
అయితే హెల్త్ కేర్ రంగంలో ఎఐ ప్రభావం అంతగా ఉండదని, ఈ రంగంలో డాక్టర్ల సమర్థత ఐదు రెట్లు పెరిగితే కాని తొలగింపులు ఉంటాయని, ఆ స్థాయిలో పెరుగుదల ఉండదని చెప్పారు. ప్రస్తుతం ఎఐ వేగాన్ని గమనిస్తే 2026 తొలి నాళ్లలోనే నిరుద్యోగ సమస్య పెరుగుదలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. ఉద్యోగాల విషయాన్ని పక్కనపెడితే అంతకన్నా భారీ ముప్పు పొంచి ఉందని హింటన్ హెచ్చరించారు. లాభాల వేటలో పరుగెత్తే కంపెనీలు రక్షణ నిబంధనలను విస్మరించే అవకాశముందని తెలిపారు. ఎఐ తో మున్ముందు ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టమని, మంచి, చెడులు ఉన్నాయని హింటన్ అభిప్రాయపడ్డారు.

More Stories
గ్రోక్లో అసభ్య చిత్రాలు.. ఎలాన్ మస్క్‌పై మాజీ లవర్ దావా
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడుకు 5 ఏళ్ళు జైలు శిక్ష
ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తున్న పాక్