పులఖండం మేఘనారాణి (25), కడియాల భావన (24) ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. వీరిద్దరితో కలిసి మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లారు. టూర్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద భావన, మేఘరాణి ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారని ఇక్కడి వారి బంధువులకు సమాచారం అందించారు.
ఇద్దరి వయసు 24 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరు విద్యార్థినులు మరణించడంతో గార్ల గ్రామంలో విషాదం అలుముకుంది. కాలిఫోర్నియాలో జరిగిన మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం కారు ప్రమాదంలో మరణించడంతో విషాదచాయలు అలుముకున్నాయి.

More Stories
ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ఆంక్షలపై ఉత్సవ సమితి నిరసనలు
హుస్సేన్ సాగర్‌లో యథావిధిగా నిమజ్జనాలకు అనుమతివ్వాలి
సంస్కార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో వందేమాతరం “ఆర్ట్ ఎగ్జిబిషన్”