దేశ నిర్మాణంలో క్రీడలు ఒక శక్తివంతమైన మార్గదర్శక శక్తిగా నిలవాలనే సంకల్పం స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన 41వ జాతీయ సీనియర్ క్యోరుగి ఛాంపియన్‌షిప్‌ను ఆయన ప్రరంభించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లాంటి దేశం నలుమూలల నుంచి వచ్చి పాల్గొంటున్న ప్రతీ అథ్లెట్‌కు ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.
“మీ క్రీడలతో పాటు హైదరాబాదును కూడా చూసి, హైదరాబాదు అతిథ్యసత్కారాన్ని ఆస్వాదించాలి. హైదరాబాదు బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి” అని చెప్పారు. “14వ నేషనల్ యూత్ సీనియర్ పోటీలు జరుగుతున్నాయి… ప్రతి టీంకీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు స్పోర్ట్స్ మన జీవితంలో, దేశ కార్యకలాపాల్లో ఒక ముఖ్య భాగంగా గుర్తింపు పొందింది” అని తెలిపారు. మునుపు మనం బ్రాంజ్ మెడల్ కూడా గెలవలేకపోయేవాళ్లమని, కానీ ఇప్పుడు మన క్రీడాకారులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను ఒలింపిక్స్‌లో కూడా గెలుస్తున్నారని అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుత భారత ప్రభుత్వం క్రీడలపై 2014తో పోలిస్తే 130 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందని రామచందర్ రావు చెప్పారు. కో కుడోక్, కో ఇండియా లాంటి కార్యక్రమాలు యువత క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచాయని తెలిపారు. ఈ పోటీలు వారిలో మరింత ప్రతిభను వెలికితీస్తాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్టేడియం 2001–02లో నిర్మించచారని, ఇక్కడ ఆఫ్రో–ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు జరిగాయని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించినట్లుగా, ‘వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత అభివృద్ధి, క్రీడల బలోపేతం కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, జాతీయ ఏకీకరణ-ఈ మూడు అంశాలను బలపరిచే శక్తిగా క్రీడలను మరింత మెరుగుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కీలక చర్యలు తీసుకుంటోందని ఆయన కొనియాడారు.

More Stories
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
ఎవడబ్బ సొమ్మని రేవంత్ ఫుట్ బాల్ సరదాకు రూ 100 కోట్లు!
ఫోన్ ట్యాపింగ్ లో లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీం ఆదేశం