జనవరి నుండి 85,000 అమెరికా వీసాలు రద్దు

జనవరి నుండి 85,000 అమెరికా వీసాలు రద్దు

జనవరి నుండి 85,000 వీసాలు రద్దు చేసిన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ట్రంప్‌ యంత్రాంగం వలసదారుల నిబంధనలను కఠినతరం చేయడం, సరిహద్దు ఆంక్షలతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రకటించింది. ”జనవరి నుండి 85,000 వీసాల రద్దయ్యాయి. ట్రంప్‌, కార్యదర్శి మార్క్‌ రూబియో ఒక సాధారణ ఆదేశానికి కట్టుబడి ఉన్నారు. ఇది త్వరలో ఆగదు” అని విదేశాంగ శాఖ మంగళవారం ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొంది. 

కఠినమైన వలసల నిబంధనల కొనసాగింపును ఈ ప్రకటన హైలెట్‌ చేస్తోంది. రద్దయిన వీసాల్లో 8,000 కంటే ఎక్కువ విద్యార్థులవేనని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. మద్యం తాగి వాహనం నడపడం, దొంగతనం, దాడి వంటి నేరాలు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయని, ఈ కారణాలతోనే గతేడాది సుమారు సగం వీసాలు రద్దయ్యాయని తెలిపారు.

2025లో మిగిలిన వీసాల రద్దు గురించి అధికారులు స్పందించలేదు. వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతుతో ముడిపడి ఉన్న కేసులు గతంలో ఈ విభాగం నుండి వచ్చిన వివరణ పేర్కొంది.   చార్లీ కిర్క్‌ హత్యను వేడుకగా జరుపుకున్నారన్న ఆరోపణలతో అక్టోబర్‌లో పలు వీసాలను ట్రంప్‌ యంత్రాంగం రద్దు చేసింది. గాజాకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై వేటు వేసింది.