ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘మహావతార్ నరసింహ’ చిత్రం. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మహావిష్ణువు అవతారమైన నరసింహ స్వామి – భక్త ప్రహ్లాద కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైన ఈ యానిమేటెడ్ మూవీ.
కేవలం ఒకరికొకరు సినిమా గురించి ప్రశంసా పూర్వకంగా మాట్లాడుకోవడం ద్వారానే ద్వారానే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో కథ, కథనం, అద్భుతమైన గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా? అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి.
ఆ ఎలివేషన్ సీన్స్ అందుకు తగ్గట్టుగా వచ్చే మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. యానిమేషన్ చిత్రాలంటే కేవలం చిన్నపిల్లల కోసమే అనుకునే ధోరణికి ఈ మూవీ ఫుల్ స్టాప్ పెట్టేసింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. పాకిస్తాన్‌లోని కరాచీలో గల చారిత్రక శ్రీ స్వామినారాయణ మందిరంలో “మహావతార్ నరసింహ” ప్రదర్శించబడిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం కరాచీలో మిగిలి ఉన్న కొన్ని క్రియాశీల హిందూ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది.
ప్రస్తుతం భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారతీయ సినిమాకి పాకిస్థాన్ దేశంలో నీరాజనాలు పలకడం కలకలం రేపుతోంది. ఈ యానిమేటెడ్ చిత్రం హిందూ ఇతిహాసాలపై ఆధారపడడంతో వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు తరలివచ్చి సినిమాని వీక్షిస్తునట్టు చెబుతున్నారు.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సమాచారం గానీ, అధికారిక ధృవీకరణ గానీ ఇంకా లభ్యం కాలేదు. ఏ ప్రధాన వార్తా సంస్థ గానీ, ఆలయ అధికారిక వర్గాలు గానీ ఈ ప్రదర్శన జరిగినట్లు నిర్ధారించలేదు. దీంతో అసలు ఈ వ్యవహారం నిజమేనా కాదా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు తాజాగానే ఈ చిత్రం 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యానిమేషన్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ పొందిన్నట్లు అకాడమీ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.

More Stories
శాంతి చర్చలపై ఉక్రెయిన్ వైఖరిపై ట్రంప్ అసహనం
భారత్ లో దాడులకై ఎల్ఇటి, జెఈఎంల భేటీ?
మునీర్ ను అమెరికా అరెస్టు చేసి ఉండాల్సింది