ఏ వ్యవస్థ కూలిన ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది గానీ ప్రజాస్వామ్యంకు మూల స్తంభమైన మీడియా విఫలం అయితే మానవ హక్కులు ధ్వంసం అవుతాయని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ హెచ్చరించారు. జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) 33వ వ్యవస్థాపక దినం సందర్బంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ జర్నలిస్ట్ గా మొదలైన తన అనుభవాలు ప్రస్తావించారు.
నెల్లూరు జిల్లాలోని కావలిలో తుఫాన్ కి తన నివాసం పడిపోతే తాను తీరప్రాంతంలోని ప్రజల కడగళ్లను కవర్ చేయడానికి వెళ్ళానని, అభాగ్య మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగినప్పుడు తన కలం విస్ఫులింగాలు వెదజల్లిoదని గుర్తు చేసుకున్నారు.ఇప్పటి జర్నలిస్టులలో చాలా మందికి వృత్తి నైపుణ్యం లోపించిస్తున్నట్లు విచారం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ నేటికీ ప్రజాస్వామ్యం ని కాపాడేది మీడియానే అని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో ఒకసారి వరదలు ముంచెత్తుతున్నప్పుడు కొంతమంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోడానికి బస్సు టాప్ పై చేరగాఆ దృశ్యాలను మీడియా ఛానళ్ళు కవర్ చేసాయని, అప్పుడు ఆ జిల్లా అధికార యంత్రాంగం సరైన రీతిలో స్పందించి ఉంటే కొన్ని ప్రాణాలు నిలిచేవని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో అధికార యంత్రాంగం సరిగ్గా వ్యవహరించకపోతే ప్రజల జీవితాలు చీకటి మయం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమజానికి మంచి నేతలు అవసరం అని చెప్పారు. జర్నలిజంలో మెలుకువల గురించి, విలువల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ ఒక పుస్తకం రాస్తే తాను అకాడమీ ద్వారా ప్రచురిస్తానని తెలిపారు. సమావేశం లో జాప్ జాతీయ స్థాయి నాయకులు ఉప్పాల లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సంపత్ తదితరులు మాట్లాడారు.

More Stories
ఎపిలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ
రేణిగుంట, మదనపల్లెలలో వాజ్పేయీ కాంస్య విగ్రహాలు
ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై