“రేవంత్‌కు నిజంగా దమ్ముంటే గోపీనాథ్ మృతి పై న్యాయ విచారణ చేయించాలి. రోషముంటే కేటీఆర్‌ను జైలుకు పంపించాలి” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా బోరుబండలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆయన విమర్శించారు.
“ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఏనుగులు తినే నాయకులు ఉండేవారు, ఇప్పుడు పీనుగులు పీక్కుతినే నాయకులు వచ్చారు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా డబ్బు దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేస్తున్న నేతలను ప్రజలే జవాబు చెప్పే సమయం వచ్చిందని ఆయన చెప్పారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని స్వయంగా గోపీనాథ్ తల్లి చెప్పారని ఆయన గుర్తు చేశారు.
“కేసీఆర్ కంటే కేటీఆర్ పెద్ద మూర్ఖుడు. తండ్రి సీఎం కావాలని కొడుకుకే ఇష్టం లేదు” అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని కుటుంబ రాజకీయం నుండి కాపాడాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంఐఎం నాయకులను బండి సంజయ్ చైన్ స్నాచర్స్ తో పోల్చుతూ వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9,000 కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరిందని బండి సంజయ్ ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
రావు వచ్చినా, రెడ్డి వచ్చినా తాము చెప్పినట్లు వినాల్సిందేనని అసదుద్దీన్ ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లని ధ్వజమెత్తారు. తెలంగాణను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే, తెలంగాణలో చాలాచోట్ల కాషాయ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.
టోపీ పెట్టుకున్న రేవంత్‌ను చూస్తే తనకు సినీనటుడు వేణుమాధవ్ గుర్తుకొచ్చారని చెబుతూ మంత్రి అజరుద్దీన్ తో గణేషుడి మంత్రాన్ని చదవించే దమ్ము, ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు.

More Stories
ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే తిరుమలలో దర్శనం
కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు దిక్కులేదా రేవంత్ రెడ్డి!
జూబ్లీ హిల్స్ లో ఓట్ల చీలికతో బీజేపీ ‘కింగ్’