 
                మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం ఓ వ్యక్తి 17 మంది పిల్లలను ఓ స్టూడియోలో నిర్బంధించడంతో కలకలం చెలరేగింది. చేశాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని పేర్కొంటూ కొంత మంది పిల్లలను ఆడిషన్కు పిలిచాడు.  రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఆ స్టూడియోలో పని చేస్తున్నాడు. అతడికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉన్నది. గత నాలుగు రోజులుగా రోహిత్ ఆడిషన్లు నిర్వహిస్తున్నాడు. దీంతో గురువారం ఉదయం సుమారు వంద మంది పిల్లలు ఆడిషన్ల కోసం ఆ స్టూడియోకు వచ్చారు. 
అయితే 80 మంది పిల్లలను అతడు బయటకు వెళ్లనిచ్చాడు. సుమారు 20 మంది పిల్లలను స్టూడియో లోపల ఉంచి నిర్బంధించాడు. దీంతో తమను కాపాడాలంటూ వారు హాహాకారాలు చేశారు. మరోవైపు రోహిత్ ఆర్య ఆ తర్వాత ఒక వీడియో క్లిప్ విడుదల చేశాడు. కొంత మంది వ్యక్తులతో మాట్లాడటం కోసమే పిల్లలను బందీలుగా ఉంచినట్లు తెలిపాడు. తనకు పెద్దగా ఆర్థిక డిమాండ్లు లేవని చెప్పాడు. తన డిమాండ్లు నైతికమైనవని అన్నాడు. 
పోలీసులు, అధికారులు దూకుడుగా వ్యవహరించవద్దని, తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆ ప్రాంగణానికి నిప్పు పెడతానని, తనతో పాటు పిల్లలకు హాని జరుగుతుందని హెచ్చరించాడు.  కానీ ఆ వ్యక్తి మాత్రం పిల్లలను వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. తాను డబ్బుల కోసం ఈ పని చేయలేదని, అంతేకాకుండా తానేమీ ఉగ్రవాదిని కాదని పేర్కొన్నాడు. 
ఎలాగోలా ఆ భవనంలోకి చేరుకున్న పోలీసులు పిల్లలను కాపాడే ప్రయత్నం చేయగా నిందితుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపగా అందులో హతమయ్యాడు.  ముంబైలోని పోవాయి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఆర్ఏ స్టూడియోస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.  నకు సాధారణ, నైతిక, ధార్మిక డిమాండ్లు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయని తెలిపాడు. 
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందగానే ముంబై పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు రోహిత్ ఆర్యతో చర్చలు ప్రారంభించారు.  కానీ పిల్లలను విడుదల చేయడానికి రోహిత్ ఆర్య నిరాకరించాడు.  దీంతో చేసేదేమీ లేక పోలీసులు బాత్రూమ్ ద్వారా బలవంతంగా లోపలికి ప్రవేశించి పిల్లలను రక్షించారు. పిల్లలను రెస్క్యూ చేస్తున్న సమయంలో ఎయిర్ గన్తో రోహిత్ ఆర్య పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా ఒక రౌండ్ కాల్పులు జరిపారు.  
పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు రోహిత్ ఆర్య గాయపడ్డాడు. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మరణించాడు. ఇక సంఘటన స్థలం నుంచి పోలీసులు ఎయిర్ గన్, కొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్కు వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
పూణేలో మానసికంగా బాధపడుతున్న రోహిత్ ఆర్య అనే వ్యక్తి వెబ్ సిరీస్ కోసం ఆడిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పి 17 మంది పిల్లలు, ఒక వృద్ధుడు, మరొక పౌరుడిని ఆర్ఏ స్టూడియోకు పిలిచాడని ఆరోపణలు రావడంతో ఈ సంఘటన ప్రారంభమైంది. లోపలికి వెళ్ళిన తర్వాత, అతను తలుపులు లాక్ చేసి, ఆ బృందాన్ని చాలా గంటలు బందీగా ఉంచాడు. 
మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో పోలీసులకు అత్యవసర కాల్ వచ్చింది. ఆ తర్వాత క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూ ఆర్ టి),  ప్రత్యేక విభాగాలు భవనాన్ని చుట్టుముట్టాయి. బందీలను శాంతియుతంగా విడుదల చేయడానికి మొదట చర్చలు జరిగాయి, కానీ చర్చలు విఫలమైనప్పుడు, పోలీసులు బాత్రూమ్ ప్రవేశ ద్వారం ద్వారా స్టూడియోలోకి చొరబడ్డారు.
 జాగ్రత్తగా సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్లో, పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది 17 మంది పిల్లలు సహా మొత్తం 19 మందిని రక్షించారు. బందీలను స్టూడియో గ్రౌండ్ ఫ్లోర్లో బంధించినట్లు గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దత్తా కిషన్ నలవాడే ప్రకారం, రక్షించబడిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. వారి కుటుంబాలతో తిరిగి కలిశారు. 
ప్రభుత్వ పాఠశాల ప్రాజెక్ట్ కాంట్రాక్టు నుండి చెల్లించని బకాయిలకు సంబంధించి రోహిత్ ఆర్య తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు రెండు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, ఈ అంశంపై గతంలో నిరసనలు నిర్వహించాడని, మాజీ విద్యా మంత్రి దీపక్ కేసర్కర్ నివాసం దగ్గర నిరాహార దీక్ష కూడా చేశాడని అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆర్య నకిలీ ఆడిషన్ను ఎలా నిర్వహించగలిగాడో, పిల్లలను స్టూడియోకి ఎలా ఆకర్షించాడో అర్థం చేసుకోవడానికి ముంబై పోలీసులు వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించారు.
                            
                        
	                    




More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
యమునా నదిని పరిశుభ్రం చేయడం అసాధ్యం కాదు!