 
                ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని వారు ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణను నిలిపివేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా మైనార్టీల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలనే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఎన్సిసి కోడ్ కేవలం జూబ్లీహిల్స్ పరిమితమైనప్పటికీ ఇది జూబ్లీహిల్స్‌లోని ఓటర్లను సైతం ప్రభావితం చేస్తున్నందున ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పరిగణలోకి తీసుకోవాలి అని ఎన్నికల అధికారులకు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
బీఆర్కే భవన్ వద్ద నిర్వహించిన మీడయా సమావేశంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ జరపాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని, కానీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఈ నియమం పాటించలేదని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు.





More Stories
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్
తెలంగాణపై మొంథా పంజా.. జలదిగ్బంధంలో వరంగల్
జూబ్లీహిల్స్ లో బిజెపి అనుకూల వాతావరణం