సాహిత్యంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గురువారం ప్రకటించింది. హంగేరియన్ రచయిత క్రాస్జ్నా హోర్కై ను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. లిటరేచర్‌లో గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ప్రపంచ వినాశన భయాల నేపథ్యంలోనూ కళకు ఉన్న శక్తిని ధృవీకరించే ఆయన ఆకర్షణీయమైన, దార్శనిక రచనల కోసం లాజ్లో క్రాస్నహోర్కై ని ఈ నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
ఆయన రాసిన ‘హెర్ష్ 07769’ అనే నవల జర్మనీ లోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ నవలకే నోబెల్ బహుమతి వరించింది.ఈ నవలలో చనిపోయిన ఇద్దరు అద్బుతమైన వ్యక్తులు తిరిగి వస్తారన్న నమ్మకంతో మోక్షం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజల మూఢత్వాన్ని చిత్రీకరించారు. ఇందులో హింస, అందం కలగలసి పోయిందని, ప్రపంచ వినాశనం వంటి తీవ్ర భయానక పరిస్థితుల మధ్య కూడా కళకు ఉన్న అపారమైన శక్తిని తన రచనల ద్వారా బలంగా చాటి చెప్పినందుకు లాస్లోకు ఈ గౌరవం అందిస్తున్నట్టు నోబెల్ కమిటీ అభివర్ణించింది.
ఆయన సాహిత్యం సమకాలీన ప్రపంచం లోని సంక్లిష్టతలను, మానవ అస్తిత్వ వేదనను, వినూత్నశైలిలో ఆవిష్కరించారని పేర్కొంది. 07769 నవల తరువాత 1994 లో సినిమాగా డైరెక్టర్ బెలాటార్ రూపొందించారు. ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ (అలౌకిక) భయాల మధ్య కూడా కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
లాస్లో గాఢమైన ఆలోచనలు, మానవ మనస్తత్వాన్ని లోతుగా వ్యక్తపరిచే శైలికి ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. గంభీరమైన వాక్య నిర్మాణాలు, నిరాశ, భవిష్యత్తు, గురించి భయపెట్టే ఇతివృత్తాలతో కూడిన పోస్ట్‌మోడర్న్ ( ఆధునికానంతర )నవలలు రచించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్య రచనలలో ‘సాతాన్ ట్యాంగో’ , ‘ది మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్’ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఈ రచనలు మానవుడి ఒంటరితనం, ఆధునిక నాగరికత లోని నిస్సారతపై సాహిత్యపరంగా మంచి పేరు పొందాయి.
అనేక అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఈయనకు లభించాయి. వాటిలో బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2015లో లభించింది. సినీ దర్శకుడు బెలా టార్ తీసిన చిత్రాలు కూడా లాస్లో నవలల ఆధారంగా రూపొందడంతో ఆయన రచనలకు అంతర్జాతీయ ఖ్యాతి మరింత పెరిగింది. 1954 లో ఆగ్నేయ హంగేరీలో రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో గ్యులా అనే చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల ‘సాటం టాంగో’ 1985 లో ప్రచురించారు.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!