
తిరుమల పరకామణి చోరీ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పరకామణి వ్యవహారంలో పరకామణిలో దొంగతనం జరిగినట్లు 29.04.2023న రాత్రి 11గంటలకు ఎఫ్ఐఆర్ చేసి, 24 గంటల్లోగానే చార్జిషీట్ వేశారని గుర్తు చేశారు.
పరకామణిలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా 41(ఎ) నోటీసులిచ్చి పంపారని చెబుతూ ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తే అనేక వాస్తవాలు బయటకు వచ్చే అవకాశముందని లోకేష్ తెలిపారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలని, దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని లోకేశ్ హెచ్చరించారు. 2023 ఏప్రిల్ 29న పెద్ద జీయర్ మఠం క్లర్క్‌గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడగా, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతడిని పట్టుకుని, అతడి వద్ద నుంచి 900 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
అయితే, అప్పటి అధికారులు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా, లోక్ అదాలత్‌లో రాజీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా రవికుమార్ అనేకసార్లు చోరీలకు పాల్పడి వందల కోట్లు కొట్టేశాడన్న ఆరోపణలు ఉన్నాయని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ లోక్ అదాలత్ తీర్పుపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు, పరకామణి వ్యవహారంపై సీఐడీ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది.
కాగా, తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయని, నెయ్యి అని చెబుతున్న పదార్ధంలో నెయ్యి లేదని సిబిఐ దర్యాప్తులో తేలిందని లోకేష్ చెప్పారు.
కాగా, తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయని, నెయ్యి అని చెబుతున్న పదార్ధంలో నెయ్యి లేదని సిబిఐ దర్యాప్తులో తేలిందని లోకేష్ చెప్పారు.
More Stories
విజయవాడ నగరం విశేష చరిత్రకు సాక్ష్యం
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం
జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు