
న్యూఢిల్లీలో జరిగిన 56వ వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశంలో, దేశవ్యాప్తంగా సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగించేలా జీఎస్టీ స్లాబ్‌లను సులభతరం చేసి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హర్షం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీ ట్యాక్స్ తగ్గిస్తూ, జీఎస్టీ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.
12%, 28% పన్నుస్లాబ్ లను పూర్తిగా రద్దు చేసింది. 12% స్లాబ్ రద్దు చేయడంతో, ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% స్లాబ్ లలోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులపై జీఎస్టీ శాతం జీరోకు తగ్గించారని వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో, జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా సామాన్యులు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కల్పిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన స్వాగతించారు. సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు నేరుగా లాభం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలు తీసుకు వచ్చారని తెలిపారు. మోదీ ప్రభుత్వం వన్ నేషన్-వన్ టాక్స్, వన్ నేషన్-వన్ లా వంటి సంస్కరణలు తీసుకువచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు అమలులో వున్న బ్రిటిష్ చట్టాల స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు.
పాలు, పనీర్, హేర్ ఆయిల్, పాల ఉత్పత్తులు, టూత్ బ్రష్‌లు, సబ్బులు, షాంపూలపై జీఎస్టీ తగ్గింపు జరిగింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై 18% నుండి 5%, కొన్నింటిపై 12% నుండి 5%, మరికొన్ని జీరో శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గారికి జీఎస్టీ తగ్గించినందుకు, పండుగ సమయంలో ఊరట ఇచ్చినందుకు బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పాలాభిషేకం కార్యక్రమాలు చేయాలని ఆయన ఆదేశించారు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల