అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన వీసా నిబంధనలు పైచదువుల కోసం అమెరికాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపాయి. అలాగే పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ఇదే ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. తాజా అంతర్జాతీయ పరిణామాలు కూడా భారతీయులు అమెరికా పర్యటనకు వెళ్ళే నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి.
అమెరికా టూరిజం శాఖ గణాంకాల ప్రకారం, గత సంవత్సరం జూన్‌లో 2.3 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించగా, ఈ సంవత్సరం అదే నెలలో 2.1 లక్షల మంది మాత్రమే సందర్శించారు. అంటే దాదాపు 8 శాతం తగ్గుదల. జులై నెలలో కూడా ఇదే ధోరణి కొనసాగి, 5.5 శాతం పడిపోయింది.
మొత్తం మీద అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని రికార్డులు తెలియజేస్తున్నాయి. అమెరికా టూరిజం రంగ నిపుణులు ఈ పరిస్థితి కొనసాగితే పర్యాటక రంగానికి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ నాలుగో అతిపెద్ద సోర్స్ కావడంతో భారతీయుల రాక తగ్గడం అమెరికా టూరిజం పరిశ్రమకు ఆర్థికంగా నష్టం కలిగించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

More Stories
2036 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యంకు భారత్ తో సహా 7 దేశాలు పోటీ
ఫ్లైదుబాయ్ హీరో స్మిత్ మచ్చర్ పుర్రెకు పగుళ్లు.. అత్యవసరంగా ఆపరేషన్
న్యూట్రినోలను బంధించిన ఫ్రాన్సిస్ హాల్జన్‌కు ఫిజిక్స్‌లో నోబెల్