
రంగారెడ్డి జిల్లాలో ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ మండలం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురంలో గిరిజన యువతి అనుమాదాస్పంగా ఆత్యహత్యాయత్నం చేసుకుంది. వెంటనే యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం అఖిల అనే యువతి బిఇడి చదువుతూ హస్తినాపురంలో తన కుటుంబంతో కలిసి ఉంటుంది. రసూల్ అనే వ్యక్తి ప్రేమ పేరిట యువతి అఖిలను ట్రాప్ చేశాడు. అఖిల, రసూల్ మధ్య గొడవ జరగడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమెను ఆటోలో తరలించడానికి ప్రయత్నించగా, యువతి అక్క ఎవరు నువ్వు ప్రశ్నించడంతో అక్కడి నుంచి రసూల్ పరుగులు తీసాడు.
యువతి తల్లిదండ్రులు రసూల్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు అతడిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. తమ కూతురిని లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసిన రసూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియుడు రసూల్ మీదే అనుమానం ఉందని అఖిల తండ్రి వాపోతున్నాడు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్