
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మకు భక్తులు, వీఐపీల కోసం రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుంది. కాకతీయ రాజుల కాలం నుంచి వస్తున్న ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జాతర సమయంలో భక్తులు, వీఐపీలు బస చేయడానికి వీలుగా మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికి నాలుగునూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు.
ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం, జాతర నిర్వ హణలో సౌకర్యాలను గణనీయంగా మెరుగు పరుస్తుంది.
గెస్ట్ హౌస్ నిధుల మంజూరు వెనుక మంత్రి సీతక్క కృషి ఉండని, ఆమె ప్రయత్నాలు ఫలించాయని స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేశాను తలపించే ఈ సమ్మక్కసారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క కోరారు. జాతరలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ శాఖ సేవలు, రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ప్రత్యేక నిధులు కేటాయించిందని ఆమె చెప్పారు. కొత్తగా నిర్మంచనున్న గెస్ట్ హౌస్, ఇతర మోలిక సదుపాయాల అభివృద్ధి భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత