
అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. మాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూలోని 345 ఆకాశహార్మ్యంలోకి చొరబడిన 27 ఏళ్ల షేన్ డెవాన్ తమురా కాల్పులకు తెగబడడంతో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎన్‌వైపీడీ పోలీసు అధికారి డిదారుల్ ఇస్లామ్ (36) కూడా ఉన్నారు.
నిందితుడిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏండ్ల షేన్ డెవోన్ తమురాగా గుర్తించారు. సోమవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో మ్యాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూ ఆకాశహార్మ్యంలోకి చొరబడిన తముర బిల్డింగ్‌లోని 32 అంతస్తు లాబీలో ఎన్‌వైపీడీ పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. అనంతరం 33వ అంతస్తులోకి వెళ్లిన నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో మరో ముగ్గురు మరణించారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడు కూడా గాయపడి ప్రాణాలు వదిలాడు. లాస్ వెగాస్‌కు చెందిన తమురా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి, ఏఆర్-15 రైఫిల్‌తో ఆకాశహార్మ్యం లాబీలోకి ప్రవేశించాడు. ఈ ఘటనతో భవనంలోని ఉద్యోగులు భయపడి పరుగులు తీశారు, కొందరు కార్యాలయాల్లో దాక్కున్నారు. ఘటన సమయంలో భవనం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది, ఎన్‌వైపీడీ, ఎఫ్‌డీఎన్‌వై, ఎఫ్‌బీఐ బృందాలు తక్షణ స్పందన చేపట్టాయి.
న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ఘటనను ఎక్స్ వేదికగా ఖండించారు. “మాన్‌హట్టన్‌లో జరిగిన ఈ దారుణ షూటింగ్ మన సమాజాన్ని కలవరపరిచింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం,” అని పేర్కొన్నారు. ఎన్‌వైపీడీ కమిషనర్ కీచంట్ సెవెల్ ఈ ఘటనను “అమెరికాలో గన్ హింసకు మరో దురదృష్టకర ఉదాహరణ”గా అభివర్ణించారు. 2025లో ఇప్పటివరకు అమెరికాలో 254 మాస్ షూటింగ్ ఘటనలు నమోదైనట్లు గన్ వైలెన్స్ ఆర్కైవ్ తెలిపింది.
షేన్ తమురా, నెవాడాకు చెందిన వ్యక్తి, గతంలో హవాయిలో నివసించాడు. సోషల్ మీడియాలో కొందరు అతడు ఎన్‌ఎఫ్‌ఎల్ ఆశలు కలిగి ఉన్నాడని, వాటి వైఫల్యం వల్ల నిరాశతో ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఊహించారు.
More Stories
పాక్ సైనికుల దుస్తులతో ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రదర్శనలు
కెనడాలోని కపిల్ శర్మ ‘కాప్స్ కేఫ్’పై మళ్లీ కాల్పులు
లండన్‌లోని ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో ఘనంగా దీపావళి వేడుకలు