
తెలంగాణలోని నల్గొండ డయోసెస్ బిషప్ కర్ణం ధమన్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనపై జర్మనీలోని ఒక డయోసెస్‌లో ఎటువంటి అర్చక విధులు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. 2005 నుండి 2007 మధ్య జరిగిన ఘటనపై 2025 మర్చిలో జర్మనీలోని మున్స్టర్ డయోసెస్‌కు ఫిర్యాదు అందడంతో ఈ చర్య తీసుకున్నారు.
ధమన్ గతంలో పూజారిగా పనిచేసిన జర్మనీలోని ఒక పారిష్‌ను సందర్శించడానికి దాదాపు ఒక నెల ముందు గత ఏప్రిల్ లో తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయనను మున్స్టర్ డియోసెస్‌లో ఎటువంటి అర్చక కార్యకలాపాల నిర్వహించకుండా నిషేధించారు. మున్స్టర్ జర్మనీలోని ఒక నగరం. ఫిబ్రవరి 2024లో పోప్ ఫ్రాన్సిస్ ధమన్ కుమార్‌ను నల్గొండ డయోసెస్ బిషప్‌గా నియమించారు.
ఆ సమయంలో, ఆయన మున్స్టర్ డయోసెస్‌లో పారిష్ పూజారిగా పనిచేస్తున్నారు. ఆయన ఏప్రిల్ 30, 2024న నల్గొండ బిషప్‌గా నియమితులయ్యారు. మున్స్టర్ డియోసెస్ ఏప్రిల్ 24, 2025న విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం లైంగిక వేధింపుల ఆరోపణ జరిగినప్పుడు ధమన్ కుమార్ మున్స్టర్‌లోని వివిధ చర్చిలలో చాప్లిన్‌గా పనిచేస్తున్నారు. మున్స్టర్ డియోసెస్ ఇంటర్వెన్షన్ ఆఫీసర్ కూడా మున్స్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఒక నివేదికను దాఖలు చేశారు.
ధమన్ కుమార్ మొదట 2001 నుండి 2012 వరకు మున్స్టర్ డియోసెస్‌లో పనిచేశాడు. భారతదేశంలో వివిధ నియామకాల తర్వాత, మళ్ళీ 2017 నుండి 2020 వరకు, అతను పాస్టర్‌గా పనిచేశాడు. అతను 2020లో ఎస్సెన్ (ఓల్డెన్‌బర్గ్)లోని సెయింట్ బార్తోలోమాస్ పారిష్‌కు మారాడు. 2019లో పోప్ ఫ్రాన్సిస్ జారీ చేసిన కాథలిక్ చర్చిలో లైంగిక వేధింపులను నివేదించడానికి నిబంధనల ప్రకారం, “ఆరోపణలు వచ్చిన డియోసెస్ రోమ్‌లోని డికాస్టరీ ఫర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ఫెయిత్ (డిడిఎఫ్) రెండింటికీ తెలియజేయడానికి బాధ్యత వహిస్తుంది” అని మున్స్టర్ డియోసెస్ తన ప్రకటనలో పేర్కొంది.
మతాధికారుల సభ్యుల లైంగిక వేధింపుల ఫిర్యాదులను నిర్వహించడానికి డిడిఎఫ్ వాటికన్ కార్యాలయం బాధ్యత వహిస్తుంది. ధమన్ కుమార్ కేసులో, నల్గొండ డియోసెస్ హైదరాబాద్ ఆర్చ్‌డియోసెస్ పరిధిలోకి వస్తుంది. “నల్గొండ బిషప్ విషయంలో, ఇది హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోనీ పూల. మున్స్టర్ డయోసెస్ ఈ బాధ్యతలను నెరవేర్చింది. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించమని కార్డినల్ పూలా ఇప్పుడు డికాస్టరీ ఫర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ఫెయిత్‌ను అభ్యర్థించాలి” అని మున్స్టర్ డయోసెస్ నుండి వచ్చిన ప్రకటన పేర్కొంది.
ఏప్రిల్ 17, 2025 నాటి ధమన్ కుమార్‌కు రాసిన లేఖలో, మున్స్టర్ డయోసెస్ అడ్మినిస్ట్రేటర్ ఆంటోనియస్ హామర్స్ నల్గొండ బిషప్‌కు మున్స్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నివేదించిన లైంగిక వేధింపుల ఆరోపణను ప్రస్తావిస్తూ, మున్స్టర్ డయోసెస్ మొత్తం ప్రాంతంలో తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయన ఎటువంటి పూజారి విధులను నిర్వర్తించకుండా నిషేధించిన్నట్లు తెలిపారు.
ఈ లేఖలో ధమన్ కుమార్ 2020 నుండి 2024 వరకు పూజారిగా పనిచేసిన సెయింట్ బార్తోలోమాయస్ పారిష్‌ను సందర్శించడానికి మే 2025లో జర్మనీకి వెళ్లాలనే ప్రణాళిక గురించి ప్రస్తావించారు. డియోసెసన్ నిర్వాహకుడు లేఖ కాపీని డిడిఎఫ్ కు పంపామని, హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోనీ పూలాను సంప్రదిస్తామని, చర్చి చర్యలు ప్రారంభిస్తామని కూడా పేర్కొన్నారు.
ధమన్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయగరంలో జన్మించారు. ఆయన ఆర్డర్ ఆఫ్ ది మిషనరీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్‌కు చెందినవారు. 2019లో పోప్ ఫ్రాన్సిస్ జారీ చేసిన నిబంధనల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కాథలిక్ డియోసెస్‌లు జూన్ 1, 2020 నాటికి లైంగిక వేధింపులను నివేదించడానికి అందుబాటులో ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తును 90 రోజుల్లోపు పూర్తి చేయాలని కూడా నియమాలు స్పష్టం చేస్తున్నాయి. మతాధికారులు మైనర్లపై లైంగిక వేధింపులను నిరోధించడానికి పోప్ ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 2019లో చర్చిలో మైనర్ల రక్షణపై జరిగిన సమావేశం తర్వాత కొత్త నిబంధనలు రూపొందించారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్