సర్పంచ్ ఎన్నికలంటే కాంగ్రెస్ నేతల్లో కంగారు!

సర్పంచ్ ఎన్నికలంటే కాంగ్రెస్ నేతల్లో కంగారు!
మూడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు జరపాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో జనం మధ్యకు వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వణికి పోతున్నారు. అధికారంలోకి వచ్చి 18 ఏళ్లైనా ఎన్నికల హామీలు సక్రమంగా అమలు చేయక పోవడంతో గ్రామాలకు వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్న సమయంలో ఎన్నికలు వారిలో కలవరం కలిగిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లను సాకుగా చూపి కాలయాపన చేయాలని చేయాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి.  
సీఎం రేవంత్‌ సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు వదిలేసి తాను తప్పుకుంటున్నట్టు కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ బలాబలాలు, బలహీనతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ మార్చి నుంచి దశలవారీగా నిర్వ్హలించిన  సమీక్షలు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది. ఎమ్మెల్యేల్లో 40% మంది నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని ఆమె  గుర్తించినట్టు సమాచారం. 75 % నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలున్నాయని తేలిందని చెప్పకుంటున్నా రు. ఈ అంశం మీనాక్షిని కలవరపరిచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసం ఏప్రిల్‌ చివరి వారం నుంచి మే చివరి వారం వరకు కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు బృందం గ్రామాల్లో సర్వే చేసినట్టు తెలిసింది. ఇందులో ఐదుగురు మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని తేలిందట. 52 శాతం మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల కంటే సొంత పనుల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ప్రజలు తేల్చి చెప్పారట.

రాష్ట్రవ్యాప్తంగా మే 25 నుంచి జూన్‌ 10 వరకు ఐవీఆర్‌(ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) సర్వే జరిగింది. ప్రభుత్వమే థర్డ్‌ పార్టీ ఏజెన్సీతో సర్వే చేయిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ప్రధానంగా సీఎం కార్యాలయం ఒక ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించిందని చెబుతున్నారు. నియోజకవర్గాలవారీగా ఓటర్లకు ఫోన్‌ చేశారని, కాల్‌ రిసీవ్‌ చేసుకోగానే  ‘మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?’ అని అడిగి, బాగుంది, పర్వాలేదు, బాగాలేదు, చెప్పలేం అనే 4 ఆప్షన్లతో సమాధానాలు సేకరించినట్టు పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల్లో 47శాతం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు బాగా లేదని ప్రజలు తేల్చిచెప్పినట్టు సమాచారం.