
మే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) 0.39 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో డబ్ల్యుపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం 0.85శాతం ఉండగా, గత ఏడాది మేలో ఇది 2.74శాతంగా ఉంది. ఆహార వస్తువులు, తయారీ ఉత్పత్తులు, ఇంధన ధరలు తగ్గాయని సోమవారం ప్రభుత్వ నివేదిక తెలిపింది. మే 2025లో ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉండటానికి ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, విద్యుత్, ఇతర తయారీ, రసాయన ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఆహారేతర వస్తువుల తయారీ మొదలైన వాటి ధరల పెరుగుదల కారణమని పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
డబ్ల్యుపిఐ ప్రకారం ఆహార వస్తువుల ధర మే నెలలో 1.56 శాతం తగ్గింది, ఏప్రిల్‌లో 0.86 శాతం తగ్గింది. కూరగాయల ధర మే నెలలో 21.26శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో 18.26శాతంగా ఉంది. అదే సమయంలో తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్లఓ 2.62శాతం నుండి 2.04 శాతానికి తగ్గింది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా మే నెలలో 2.27శాతం తగ్గింది.
ఏప్రిల్‌లో 2.18శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ద్రవ్యవిధానాలను రూపొందించే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. గతవారం విడుదలైన డేటా ప్రకారం మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు సంవత్సరాల కనిష్టస్థాయి 2.82శాతానికి తగ్గింది. ప్రధాన కారణం ఆహార ధరలు తగ్గడం. ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఈ నెలలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను 0.50శాతం తగ్గించి, 5.50 శాతానికి తగ్గించింది.
More Stories
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్