
గత అయిదు నెలల్లో టికెట్ బుకింగ్ విండో ఓపెన్ కావడానికి ఐదు నిమిషాల ముందే 2.9 లక్షల పిఎన్ఆర్ లు జనరేట్ అయ్యాయి. ఇది నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఆ క్రమంలో టికెట్లు ముందుగానే బుక్ చేసి, తరువాత మోసపూరితంగా ఎక్కువ ధరలకు ప్రయాణికులకు అమ్మేస్తున్నారు. వారు బాట్స్ అనే ఆటోమేటెడ్ టూల్స్‌తో టికెట్లను క్షణాల్లో బుక్ చేసేవారు. దీంతో సాధారణ ప్రయాణికులు లాగన్ అయ్యేలోపే టికెట్లు అమ్ముడవుతూ ఉండేవి.
ఒకవేళ మీరు కూడా ప్రయాణించేందుకు ఐఆర్ సీటీసీలో టైముకు లాగిన్ అయి టికెట్ల కోసం ప్రయత్నిస్తే మీకు వెంటనే వెయిటింగ్ లిస్ట్ రావడం లేదా టికెట్లు లభ్యం కావడం లేదు అని మెసేజ్ వస్తే మాత్రం అప్పుడు అది కుంభకోణం అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ కంటే ముందే వందల బాట్స్ ఆ టికెట్లను కావాలనే బుక్ చేస్తాయి. తర్వాత వాటిని ఎక్కువ ధరకు సేల్ చేస్తారు.
ఏజెంట్లు అక్రమ మార్గాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా వెబ్‌సైట్‌ను హైజాక్ చేసి, గంపగుత్తగా టికెట్లు బుక్ చేస్తున్నారని, వాటిని బ్లాక్‌లో అమ్ముతున్నారని పేర్కొంటున్నారు. ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్ కాకపోవడంతో మధ్యవర్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఆర్‌సీటీసీలోని అవినీతి అధికారుల హస్తం ఉందని వివిధ సామాజిక మాధ్యమ వేదికలపై పోస్టుల ద్వారా ఆరోపిస్తున్నారు.
ఇది చిన్న మోసం కాదని, ఒక పెద్ద ముఠాగా మారిపోయి, దేశవ్యాప్తంగా స్కాం చేశారని అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రత్యేక రైళ్ల టికెట్లు, తత్కాల్ టికెట్లు ఇలా ఏదైనా బుక్ చేయాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడిందని కనుగొన్నరు. బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికి ముందే టికెట్లు మాయమైపోతుంటమే ఈ స్కామ్ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ముఠా బాట్స్ ఉపయోగించి ఐఆర్ సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్లు రన్ చేసి, ముందుగా లాగిన్ అయి టికెట్లు బుక్ చేసినట్లు చెప్పారు. అలాగే నకిలీ ఆధారాలతో యూజర్ అకౌంట్లను తయారు చేసి, రిజర్వేషన్లను లాగింగ్ ప్రాసెస్‌ను ముందుగా హ్యాక్ చేసేవారని వెల్లడించారు. ఈ టికెట్లను తరువాత పెద్ద మొత్తాలకు మధ్యవర్తుల ద్వారా ప్రయాణికులకు బ్లాక్‌లో అమ్మేవారు.
ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకం. దీనివల్ల లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు న్యాయంగా ప్రయాణించలేక నష్టపోయేవారు. ఈ ముఠాలో భాగమై ఉన్న నలుగురిని తాజాగా అరెస్ట్ చేసినట్టు సమాచారం. అనేక టెక్నికల్ విశ్లేషణల ద్వారా వారి బాట్లను గుర్తించి, ఫేక్ ఐడీలను బ్లాక్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు బాట్ వ్యతిరేక అప్లికేషన్ అనే కొత్త టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టారు.
ఈ యాప్ బాట్స్ ద్వారా జరిగే ఆటోమేటెడ్ బుకింగ్‌ను తక్షణమే గుర్తించి ఆపేస్తుంది. తద్వారా సామాన్య ప్రయాణికులకు మరింత పారదర్శకంగా, సమయానికి టికెట్లు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో 2.5 కోట్లు నకిలీ యూజర్ ఐడీలు బ్లాక్ చేసినట్టు అధికారులు తెలిపారు.
More Stories
ఎస్ఎఫ్ఐ నేతగా ఉంటూ ఆర్ఎస్ఎస్ వైపు … నేడు రాజ్యసభకు
లక్నోలో ‘కాకోరీ రైలు ఘటన’ శతాబ్ది ఉత్సవాలు
అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం