
సత్యసాయి జిల్లా పాలసముద్రం నాసిన్ కేంద్రం ఏర్పాటు, విస్తరణకు కృషి చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక శిక్షణా సంస్థలలో ఒకటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) ను పాలసముద్రం వంటి వెనుకబడి ప్రాంతంలో స్థాపించడం ఎంతో గర్వకారణమని తెలిపారు.
ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 729 కోట్ల మేర నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శిక్షణా కేంద్రాల్లో అతిపెద్దదిగా నిలిచిందని పేర్కొన్నారు. మొదటిసారిగా ప్రపంచ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థగా దీనికి గుర్తింపు లభించడం దేశానికి గర్వకారణమని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో ఇటువంటి ప్రఖ్యాత శిక్షణా సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఆర్ధికాభివృద్ధి కలుగుతుందని చెప్పారు. ఇలాంటి దూరదృష్టితో పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు చెబుతూ అలాగే త్వరలో ఈ సంస్థ పర్యటనకు రావాలని కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా