
కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని పేర్కొంటూ అంతా కలసి రావాలని తాను సూచించినా సానుకూలంగా స్పందించకపోవడం సరికాదని హితవు చెప్పారు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్లకు గురిచేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయనే భావన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని, అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పారు.
ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారని సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ, పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తమకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటూ రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు