
మహిళా నటిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ ఆరోపణల కేసులో టీవీ నటుడు మడనూరు మనుణు బెంగళూరులో అరెస్టు చేశారు. 33 సంవత్సరాల నటి ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన మనును అరెస్టు చేసిన తర్వాత పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో బాధితురాలు తనకు తెలుసునని అంగీకరించాడు.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను మాత్రం ఖండించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని, అదంతా కుట్రగా ఆరోపించారు. కన్నడలో ‘కామెడీ ఖిలాడీ’ షోతో మను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే షో సెట్‌లో 2018లో మనును కలిసినట్లు బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరం స్నేహితులయ్యామని, తనను నాగర్భావిలోని అద్దె ఇంట్లో ఉంచాడని పేర్కొంది.
2022 నవంబర్‌లో శివమొగ్గ జిల్లాలోని శికారిపురలో జరిగిన కార్యక్రమానికి వెళ్లామని, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కలువాలనే సాకుతో హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. డిసెంబర్ 2022లో బలవంతంగా తన ఇంటికి వచ్చి మెడలో మంగళసూత్రం వేశాడని చెప్పింది. ఆ తర్వాత లైంగిక వేధింపులు కొనసాగించాడని, ఈ సమయంలో తాను గర్భం దాలిస్తే. గర్భస్రావం మాత్రలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
రెండుసార్లు ఇలాగే జరిగిందని, ఈ విషయం బయటపెట్టొద్దని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
More Stories
లక్నోలో ‘కాకోరీ రైలు ఘటన’ శతాబ్ది ఉత్సవాలు
బిహార్ ఓటర్లలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థులు!
రాజ్యసభకు న్యాయవాది ఉజ్వల్ దేవ్, దౌత్యవేత్త హర్ష