
ఆమెకు 2020 జులైలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టారు. ఆరు నెలల లోపునే శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఆమెకు కేబినెట్ హోదా కల్పిస్తూ పదవి ఇచ్చారు. కానీ ఆమెకు స్థానికంగా తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి మొదటి నుంచి ఉండేది. స్థానికంగా జరిగే అధికారిక కార్యక్రమాలలో గాని రాష్ట్రస్థాయిలో జరిగే ఎలాంటి అధికారిక కార్యక్రమాలలో ఆమెకు పాల్గొనేందుకు తగిన అవకాశం కల్పించకుండా అణగదొక్కారనే బలమైన అసంతృప్తితో రగిలిపోతూ వచ్చారు.
2023 నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. వైఎస్సార్సీపీలో సముచిత స్థానం లేకపోవడం అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తనను అణగదొక్కుతూ వచ్చారన్న విషయాన్ని ఆమె పార్టీ అధిష్టానం దృష్టి కూడా పలుమార్లు తీసుకెళ్లింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో గత ఎన్నికల సమయంలోనే ఆమె స్తబ్దతగా ఉండిపోయారు. కూటమీ ప్రభుత్వం రాగానే టీడీపీ యువ నాయకుడు లోకేశ్‌ను కలిశారు. శాసన మండలిలో కూడా ఆమె పెద్దగా పాత్ర పోషించలేదు.
గత ఆరు నెలల కిందట టీటీడీ దర్శన టికెట్లను జకియా ఖానం అమ్ముకున్నారన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతల బయటపెట్టారని ప్రచారం సాగింది. స్థానికంగా ఆమెను బలహీనపరిచేందుకు సామాజిక మధ్యమాలలోనూ వైఎస్సార్సీపీ నాయకులు పోస్టులు పెడితే వచ్చారు. ఈ వ్యవహారాలన్నీ కలగలిపి తన రాజీనామాకు దారి తీసాయి అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాయచోటి మైనార్టీ వర్గాలలో ఓ బలమైన నేత వైఎస్సార్సీపీను విడటం చర్చనీ అంశమైంది.
More Stories
భారత్ `విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా