
పాకిస్తాన్ దుస్సాహసానికి ప్రతిగా భారత బలగాలు రావల్పిండి సమీపంలోని చక్లాలాలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్‌బేస్, చక్వాల్లోని మురీద్ ఎయిర్‌బేస్, జాంగ్ జిల్లా షోర్కోట్లోని రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన విషయాన్ని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు.
పాకిస్తాన్‌లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ రాత్రిపూట విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్లోని మురిద్, షోర్కోట్లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో పాకిస్తాన్ మధ్యాహ్నం 12 గంటల వరకు తన గగనతలాన్ని మూసివేసింది.
పెషావర్‌కు వెళ్లే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం పిఐఏ 218 పాకిస్తాన్ గగనతలంలో చివరి వైమానిక విమానం అని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్‌తో సహా ప్రధాన నగరాల్లో పేలుళ్లు సంభవించాయని పాక్ అధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్‌లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ రాత్రిపూట విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్లోని మురిద్, షోర్కోట్లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడి చేశామని, అవి పూర్తిగా ధ్వంసమయ్యాని తెలిపారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నామని తెలిపారు. కాగా, ఎస్-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేసిందని సోఫియా ఖురేషి పేర్కొన్నారు.
More Stories
ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచపటంలో పాక్ ఉండదు!
పీఓకేలో హక్కుల ఉల్లంఘనలకు పాక్ సమాధానం చెప్పాలి
యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి