
అక్షయ తృతీయ సందర్భంగా మార్కెట్‌లో ఉత్సాహం కనిపించింది. భారత్‌లో అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నది. దాంతో బంగారం కొనుగోళ్లు భారీగానే జరిగాయి. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగ్గా చాలామంది తగ్గుతాయనే ఆశలో పసిడి కొనుగోలును వాయిదా వేస్తూ వస్తున్నారు.
అయితే, రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారం ధర స్థిరంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత బంగారం ధరల నేపథ్యంలో చాలామంది జాగ్రత్తగా ఉన్నారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ నేపథ్యంలో అమ్మకాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే, పెట్టుబడుల విషయం డిమాండ్ బలంగానే ఉన్నది.
ఈ కాలంలో 43.6 టన్నుల నుంచి 7శాతం పెరిగి 46.7 టన్నులకు చేరింది. దానికి తోడు మార్కెట్‌లో అనిశ్చితి నేపథ్యంలో బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. గోల్డ్ బార్స్, నాణేలకు డిమాండ్ ఉన్నది. 2025 క్యాలెండర్ తొలి త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 25శాతం తగ్గి 71.4 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో 95.5 టన్నులుగా ఉన్నది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2020 తర్వాత ఈ ఏడాది డిమాండ్ అత్పల్పంగా ఉన్నది.
జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 8 శాతం పెరిగి 167.4 టన్నులకు చేరాయి. అయితే వినియోగదారులు రికార్డు ధరలు ఉన్నప్పటికీ బంగారం రీసైక్లింగ్ 32 శాతం తగ్గి 26 టన్నులకు చేరుకుంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో పది గ్రాముల బంగారం సగటు త్రైమాసిక ధర రూ.79,633.4 ఉండగా.. 2024 తొలి త్రైమాసికంలో రూ.55,247 పలికింది. మరో వైపు 2025 జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రపంచ బంగారం డిమాండ్ ఒక శాతం పెరిగి 1,206 టన్నులకు చేరుకుంది. 2019 తర్వాత తొలి త్రైమాసికంలో భారీగా డిమాండ్ ఉన్నది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా