బాబా రాందేవ్‌ ‘షర్బత్‌ జిహాద్‌’ వ్యాఖ్యలు కోర్టు దిక్కారనే

బాబా రాందేవ్‌ ‘షర్బత్‌ జిహాద్‌’ వ్యాఖ్యలు కోర్టు దిక్కారనే
హమ్‌దార్డ్ కంపెనీ షర్బత్‌పై బాబా రాందేవ్ చేసిన ‘షర్బత్ జిహాద్’ వ్యాఖ్యలు  కోర్టు ధిక్కరణకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేయనున్నది. హమ్‌దార్డ్ ఉత్పత్తులకు సంబంధించి రాందేవ్‌ బాబా ఎలాంటి ప్రకటనలు చేయకుండా గతంలో కోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. యోగా గురువు ఎవరి నియంత్రణలో లేడని, ఆయన తన సొంత ప్రపంచంలోనే నివరిస్తున్నాంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. 
ఇటీవల హమ్‌దార్డ్‌ ఉత్పత్తులపై భవిష్యత్‌లో ఎలాంటి ప్రకటన చేయొద్దని ఢిల్లీ హైకోర్టు ఇటీవల యోగా గురువును ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉన్నా బాబా రాందేవ్‌ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోను విడుదల చేశారని జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ పేర్కొన్నారు. ఆయన తన ఆలోచనలను తనలోనే ఉంచాలని, వాటిని వ్యక్తపరచాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
హమ్‌దార్డ్‌ సంస్థకి చెందిన రూఅఫ్జాపై రామ్‌దేవ్‌ ఇకపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు, ప్రకటనలు, వీడియోలను పోస్ట్‌ చేయకూడదంటూ గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల దృష్ట్యా ఆయన అఫిడవిట్‌, వీడియో ప్రాథమికంగా కోర్టు ధిక్కారణ కిందకే వస్తాయని తెలిపారు. విచారణకు హాజరుకావాల్సిందిగా రామ్‌దేవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3న పతంజలికి చెందిన గులాబ్‌ షర్బత్‌ బ్రాండ్‌ని బాబా రాందేవ్‌ ప్రచారం చేశారు.
రూ అఫ్జా నుంచి వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని ఆయన విమర్శించారు. షర్బత్‌ జిహాద్‌ అంటూ రూ అఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.  ఆయన వ్యాఖ్యలపై హమ్‌దార్డ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్‌ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు విచారణ సమయంలో బాబా రాందేవ్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను ఏ బ్రాండ్‌ పేరు కానీ, కమ్యూనిటీ పేరు కానీ చెప్పలేదని తెలిపారు. 

మహ్‌దార్డ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ  ఇది పపింరువు నష్టం కేసును దాటిపోయిందని, విభజనను సృష్టించే కేసు అంటూ వాదనలు వినిపించారు. కోర్టు రాందేవ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టులతో సహా కంటెంట్‌ను వెంటనే తొలగిస్తామని రాందేవ్‌ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.