బాధితుల కుటుంబాలకు, భారత ప్రభుత్వానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు భద్రతా మండలి సభ్యులు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని భద్రతా మండలి సభ్యులు తెలిపారు. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవిగా తెలిపారు. అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. అదే సమయంలో చురుగ్గా వ్యవహరించాలని కోరారు.
మరోవైపు, పహల్గాంలో జరిగిన అమానుష ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యటకులు మృతి చెందడం అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. పౌరులపై జరిగిన ఈ దాడి మానవతా విలువలను తుంచేస్తుందని ఐరాస స్పష్టం చేసింది. ఈ విషయంపై ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాతో ఇటీవల మాట్లాడారు.

More Stories
2036 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యంకు భారత్ తో సహా 7 దేశాలు పోటీ
ఫ్లైదుబాయ్ హీరో స్మిత్ మచ్చర్ పుర్రెకు పగుళ్లు.. అత్యవసరంగా ఆపరేషన్
న్యూట్రినోలను బంధించిన ఫ్రాన్సిస్ హాల్జన్‌కు ఫిజిక్స్‌లో నోబెల్