
ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎండోమెంట్స్) శైలజా రామయ్యర్(ఐఏఎస్), కమిషనర్ శ్రీధర్(ఐఏఎస్), ధార్మిక పరిషత్ అడ్వైజర్ గోవింద హరి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆలయ ఈఓ మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సరస్వతీ పుష్కరాలు’ పండుగకు స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విస్తృతంగా చేపట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
ఈ సరస్వతీ పుష్కరాలకు రోజుకు 50 వేల నుంచి లక్ష దాకా వస్తారని అంచనా వేస్తున్నట్టు మంత్రి కొండా వివరించారు. అక్కడ 17 అడుగుల రాతి సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చలువ పందిళ్లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు పెద్ద ఎత్తు సంఖ్య ఆలయాలకు వస్తున్నట్టు కొండా సురేఖ చెప్పారు.
కాగా, పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు. ‘ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఆమె తెలిపారు పవిత్ర సరస్వతీ పుష్కర స్నానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసిస్తారని ఆమె తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తున్నందున కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమ తీరంలో గతంలో తేదీ 2013 మే 30 నుంచి 10 వరకు కాళేశ్వరంలో సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహించినట్టు మంత్రి కొండా తెలిపారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఈ పుష్కర స్నానం చేయనున్నట్టు మంత్రి కొండా తెలిపారు. పుష్కర ప్రారంభం మే 15, 16వ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుంచి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామిలు పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభిస్తారని చెప్పారు.
మే 17వ తేదీన తుని తపోవనం పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, మే18వ తేదీ, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, మే 19వ తేదీన నాసిక్ త్రయంబకేశ్వర్ శ్రీ శ్రీ శ్రీ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23వ తేదీన హంపి విరుపాక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి పుష్కర స్నానం ఆచరిస్తారని మంత్రి కొండా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిందని మంత్రి కొండా తెలిపారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్