
ఆదివారం డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో ఎస్‌సి వర్గీకరణపై వేసిన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఎస్‌సి వర్గీకరణ చట్టానికి తుది రూపం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన ఎస్‌సి వర్గీకరణ తొలి ప్రతిని డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయ నున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సబ్ కమిటీ ఉపాధ్యక్షుడు దామోదరం రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ఎస్‌సి వర్గీకరణ ఒన్ మెన్ కమిషన్ కు అధ్యక్షత వహించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్, ఎస్‌సి అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జస్టిస్ షమీమ్ మక్తర్ ఆధ్వర్యంలో కమిషన్ రూపొందించిన సిఫారసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం వర్గీకరణ చట్టాన్ని ఆమోదించినట్లు ఆయన చెప్పారు. కమిషన్ ప్రతిపాదించిన క్రిమిలేయర్ ప్రతిపాదనను సైతం తిరస్కరించినట్లు ఆయన తేల్చి చెప్పారు.
ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఉప కులాల హక్కులను హరిస్తే ఏర్పడబోయే పరిణామాలను గమనించి వర్గీకరణ ధర్మబద్ధంగా ఉండేలా తుది రూపు నిచ్చినట్లు ఆయన చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో ఎస్‌సి ల జనాభా 17.5 శాతానికి చేరిందని 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఎస్‌సిలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
More Stories
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం
తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలి
కాళేశ్వరంలో డిజైన్లు, నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు