ఓ షాప్ ఓపెనింగ్‌కు హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ నటిపై లైంగిక దాడికి పాల్పడిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఏదైన కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్లకు సినీ తారలను పిలవడం, వారితో షాప్‌ను ఓపెన్ చేయించి ప్రకటనలు ఇస్తుండటం చేస్తుంటారు. అలాగే హైదరాబాద్‌లో ఓ షాప్ ఓపెనింగ్ కోసం ఏకంగా బాలీవుడ్ నటిని పిలిపించారు.
ఆమె కూడా అందుకు అంగీకరించి హైదరాబాద్‌కు వచ్చింది. తీరా ఇక్కడకు వచ్చాక ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటికి హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాలు తమ షాప్ ఓపెనింగ్ చేయాలని కోరింది. అందుకు పారితోషకం, ఛార్జీలు అన్నీ కూడా చెల్లిస్తామని తెలిపింది. దీనికి ఒప్పుకున్న సదరు నటి ఈనెల 18న హైదరాబాద్‌కు వచ్చింది.
మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో బస చేసింది. ఈ క్రమంలో ఈ నెల 21న రాత్రి ఆమె ఉన్న అపార్ట్మెంట్లోకి ఇద్దరు మహిళలు,
ఈనెల 21న రాత్రి 9 గంటల సమయంలో ఆమె హోటల్ లో నిద్రిస్తున్న వేళ ఇద్దరు అమ్మాయిలు రూమ్ లోకి వచ్చారు. తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు.
మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఇద్దరు అబ్బాయిలు ఆమె గదిలోకి చొరబడ్డారు. వాళ్లిద్దరూ ఆమెను రేప్ చేసేందుకు యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కాళ్లు,చేతులు కట్టేసి హింసించారు. అనంతరం ఆమె బ్యాగులోని రూ. 50,000 నగదు, కొంత బంగారంతో అక్కడి నుంచి పారిపోయారు.
బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వారు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాధితురాలి వద్ద నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేశారు పోలీసులు.

More Stories
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు