
తెలంగాణలో మొబైల్ ఫోన్ల సంఖ్య జనాభాను మించిపోయినట్లు ట్రాయ్ నివేదిక 2024 స్పష్టం చేసింది. ప్రతి వంద మందికి 105కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయని, దేశ సగటు 82 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. వైర్ లైస్ టెలీడెన్సిటీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు, మరో 15 లక్షలకు పైగా ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి.
రాష్ట్రంలో మూడు కోట్ల 64 లక్షలకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా – ట్రాయ్ 2024 సెప్టెంబర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4,19,40,000. అందులో 96.38 శాతం అంటే 4,04,20,000 మొబైల్ ఫోన్లు, 15,25,000 వేల ల్యాండ్ లైన్ ఫోన్లు 3.62 శాతంగా ఉన్నాయి.
రాష్ట్రంలోని టెలిఫోన్ వినియోగదారుల్లో 60 శాతానికి పైగా పట్టణ ప్రాంతాల్లో, 39 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మొబైల్ ఫోన్లకు సంబంధించి చూస్తే పట్టణ ప్రాంతాల్లో 59 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం వినియోగదారులు ఉన్నారు. ల్యాండ్ లైన్ వినియోగదారుల్లో 96 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉండగా కేవలం నాలుగు శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు.
ట్రాయ్ నివేదిక 2024 ప్రకారం మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర వైర్ లైస్ టెలీడెన్సిటీ 105.32 గా ఉంది. గోవా 152, కేరళ 115, హర్యానా 114 శాతంతో దేశంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 104 శాతంతో తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 78.93 శాతంతో ఉంది.ఈ ట్రెండ్ కొనసాగితే, తెలంగాణలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 5 కోట్లకు చేరవచ్చని, అదే సమయంలో జనాభా 4 కోట్ల లోపే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
More Stories
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం
తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలి
కాళేశ్వరంలో డిజైన్లు, నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు