
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో భారతీయ విద్యార్థి బాదర్‌ఖాన్ సూరిని అమెరికా భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాదర్ ఖాన్ వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో రీసెర్చర్‌గా ఉన్నారు. సోమవారం అర్థరాత్రి వర్జినీయాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు ఆయన్ని అరెస్టు చేశారు.
ఆయన వీసాను కూడా రద్దు చేసినట్లు యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆప్ హోంల్యాండ్ సెక్యూరిటీస్ (డిహెచ్‌ఎస్) తెలిపింది. సోషల్ మీడియాలో హమాస్‌కు మద్దతు ప్రచారం చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, ఆయన్ని భారత్‌కు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు డిహెచ్‌ఎస్ స్పష్టంచేసింది.
కాగా, తన అరెస్టు, బహిష్కరణపై బాదర్‌ఖాన్ ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే అమెరికా ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని, తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని బాదర్ ఖాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
బాదర్‌ఖాన్ భారత్‌కు చెందిన వ్యక్తి. అయితే అతని స్వస్థలంకి సంబంధించిన వివరాలపై స్పష్టత లేదు. అతని విద్యాభ్యాసం భారత్‌లోనే గడిచినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ స్టడీస్‌పైన పిహెచ్‌డి చేశారు. ఆ తర్వాత ఇరాక్, ఆఫ్గనిస్తాన్‌లో శాంతిస్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేశారు.
అమెరికాకు వలస వెళ్లిన బాదర్ మఫెజ్ అహమద్ యూసఫ్ సలే అనే పాలస్తీనా మూలాలు ఉన్న అమెరికన్ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. అయితే ఆమె తండ్రి హమాస్‌లో కీలక నేత అయిన అహ్మద్ యూసెఫ్‌గా డిహెచ్‌ఎస్ ప్రకటించింది.
More Stories
చైనాపై సుంకాలను తగ్గిస్తామన్న ట్రంప్
ఉగ్రదాడి సమయంలో భారత్ కు ట్రంప్ మద్దతు
శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు