
మరోవైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైఎస్సార్సీపీ నుంచి కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరటంతో ఆ పార్టీ అభ్యర్థులకు పరాజయం తప్పలేదు. దీంతో ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు మీద అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరో ఏడాది పదవీ కాలం ఉండగానే కావటి రాజీనామా చేశారు.
కాగా, ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ సీటు గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం టీడీపీ పక్ష నాయకునిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర మేయర్ అయితే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ పెమ్మసాని వెల్లడించారు.
వైఎస్సార్సీపీలో గెలిచి డిప్యూటీ మేయర్గా ఉన్న సజీల గత ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. ఆమెను అలాగే కొనసాగించినా మరో డిప్యూటీ మేయర్ సీటు ఉంటుంది. అది జనసేనకు దక్కే అవకాశం ఉంది. కోవెలమూడి రవీంద్ర సాధారణ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ సీటు ఆశించారు. అయితే సామాజిక సమీకరణల్లో భాగంగా ఆ సీటు గల్లా మాధవికి దక్కింది. దీంతో ఆయన మేయర్ పదవి తనకే వస్తుందని భావిస్తున్నారు.
More Stories
కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు